అప్పుల కోసం నానా తిప్పలు పడుతున్న ఆంధ్రప్రదేశ్‌కి ఐపీఎల్ టీమ్ అవసరమా? మంత్రి పేషీలో అటెండర్లకి జీతాలు ఇవ్వలేని దుస్థితికి రాష్ట్రాన్ని చేర్చిన పాలకులు ఐపీఎల్ టీము ఆలోచన వెనుక ఏదో అతి పెద్ద కుంభకోణమే దాగి ఉందని అనుమానాలు బలపడుతున్నాయి. జగన్ రెడ్డిని ఒకరు కలిశారంటే, ఏదో భారీ ప్యాకేజీ తీసుకోవడం, రాష్ట్రానికి నష్టం చేసే వేలకోట్ల పందేరానికో రంగం సిద్ధం అవుతోందని నాలుగేళ్ల పరిస్థితులు స్పష్టం చేస్తున్నాయి. ఇటీవల కాలంలో వరసగా క్రికెటర్లు జగన్ రెడ్డితో భేటీ అవుతున్నారు. మన రాష్ట్రానికి చెందిన క్రికెటర్లు మన ముఖ్యమంత్రిని కలవడం పెద్ద విశేషం ఏమీ కాదు. అందరూ ఆమోదించే భేటీలే. ఈ భేటీల వెనుక ఏదో లూటీకి స్కెచ్ వేస్తున్నారనే అనుమానమే ఇప్పుడు ఏపీ మేధావులు వ్యక్తం చేస్తున్నారు. ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌కి ఆడిన అంబటి రాయుడు ఇటీవల తాము గెలిచిన కప్పు పట్టుకుని వచ్చి సీఎం జగన్ రెడ్డికి చూపించాడు. సీఎస్కే గెలిచిన ఐపీఎల్ కప్‌ని తిరుమల శ్రీవారి సన్నిధిలో ఉంచి పూజలు చేశారు. ఈ సీఎస్కే టీము యజమాని ఇండియా సిమెంట్స్ శ్రీనివాసన్ జగన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో నిందితుడు. ఇప్పుడు చుక్కలు కలపండి. జగన్ అక్రమాస్తుల కేసులో నిందితుడైన చెన్నై సూపర్ కింగ్స్ టీము కప్పుని జగన్ వద్దకి ఎందుకు తెచ్చిందో? నిబంధనలకి విరుద్ధంగా టిటిడిలో ఐపీఎల్ కప్‌కి పూజలు ఎలా చేశారో? ఇప్పుడు మరో క్విడ్ ప్రోకో భేటీ లింక్స్ కలుపుతూ వెళితే ఇదీ అక్కడే తేలుతాయి. కోన శ్రీకర్ భరత్. మన రాష్ట్రం నుంచి టెస్ట్ కీపర్ గా ఎంపికయ్యారు. టెస్టుల్లో అంత ప్రతిభ కనపరచకపోయినా, మన తెలుగువాడనే అభిమానంతో మనం గౌరవించుకుంటున్నాం. 5 టెస్టు మ్యాచ్‌లు ఆడిన మన కోన శ్రీకర్ భరత్ చేసిన మొత్తం పరుగులు 129. యావరేజ్ 18. అంటే ఒక టైలెండర్ కంటే తక్కువ పరుగులు-యావరేజ్. పోనీ ఐపీఎల్లో ఏమైనా ఇరగదీశాడా అంటే ఇప్పటివరకూ 10 ఐపీఎల్ మ్యాచులు ఆడిన కోన శ్రీకర్ భరత్ 200 పరుగులు కూడా చేయలేదు. తెలుగు క్రికెటర్‌కి జాతీయ జట్టులో స్థానం దొరకడం మనమంతా గర్వించేదే. కానీ కనీస పరుగులు చేయకుండా స్థానం ఎలా దొరుకుతోంది..అంటే ఇదిగో ఈ లింకులు చూడండి. జగన్ రెడ్డి కోటరీ స్వామీజీ విశాఖ స్వరూపానంద. జగన్ రెడ్డిని కాపాడే అదృశ్యశక్తి అమిత్ షా కొడుకు జై షా. కోన శ్రీకర్ భరత్ విశాఖలో స్వరూపానంద ఆశీస్సులు అందుకుంటే, జగన్ రెడ్డి ఆశీస్సులతో జై షా టీములో స్థానం ఇస్తారు. టీములో చోటు ఇప్పించే స్వామీజీ-జై షా ఆట ఆడించలేరు కదా! అదే మన భరత్ కి శాపం. తనకి టెస్టులో చోటు ఇప్పించిన సీఎం జగన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుకునేందుకు తాడేపల్లి ప్యాలెస్‌కి వచ్చాడు. చెప్పాడు. కానీ సడెన్‌గా ఐపీఎల్ టీము ప్రపోజలే ఆశ్చర్యం. మళ్లీ ఏపీ ఐపీఎల్ టీముకి సీఎస్కే మార్గనిర్దేశకత్వం అంటే...ఏదో అతి పెద్ద క్విడ్ ప్రోకో స్కెచ్ రెడీ అవుతోందనే అనుమానాలు మరింత బలపడుతున్నాయి.
క్రికెట్ మాఫియా ఏపీని మింగేయబోతోందా?..ఐపీఎల్ టీము ప్రపోజల్ అందుకేనా?
Advertisements