ఎప్పుడూ సిబిఐ చేత, ఈడీ చేత, లేక కోర్ట్ ల చేత, తిట్టించుకునే A2 విజయసాయి రెడ్డికి, ఈ సారి ట్రెండ్ మారింది... రాష్ట్రంలోని ఐపీఎస్ ఆఫీసర్లు అందరూ, విజయసాయి రెడ్డి పై ఫైర్ అవుతున్నారు.... నోరు అదుపులో పెట్టుకో, సారీ చెప్పు, లేకపోతే పరిస్థితి వేరేగా ఉంటుంది అని హెచ్చరిస్తున్నారు... ఇంతకీ జరిగిన విషయం ఏంటి అంటే, కొన్ని రోజుల క్రిందట విజయసాయి రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, మా జగన్ సియం అయిన వెంటనే, మేము కక్ష తీర్చుకునేది వారి పైనే అంటూ, ఒక లిస్టు మీడియా ముందు చదివి వినిపించారు... ఉత్తరాంధ్రలో కళావెంకటరావు, రాయలసీమలో టీజీ వెంకటేశ్‌తో పాటు, గురజాల ఎమ్మెల్యే 'యరపతినేని శ్రీనివాసరావు, సిఎంఒ ఇన్‌ఛార్జి సతీశ్‌చంద్ర, ఇంటిలిజెన్స్ చీఫ్ వెంకటేశ్వరరావుల సంగతి, ముఖ్యమంత్రిగా 'జగన్' ప్రమాణస్వీకారం చేసిన అరగంటనేలోనే చూస్తామని విజయసాయి రెచ్చిపోయారు..
రాజకీయ నాయకులు సంగతి అంటే వేరే విషయం, ఇలాంటివి రోజు వింటూనే వింటాం... కాని, అధికారుల పై, విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలతో రాష్ట్రంలోని ఐపీఎస్ ఆఫీసర్లు గుర్రుగా ఉన్నారు... పోలీస్ ఆఫీసర్స్ అసోసియేషన్, విజయసాయి రెడ్డిని తీవ్రంగా హెచ్చరించింది... ఇంటిలిజెన్స్ చీఫ్ వెంకటేశ్వరరావు పై విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యల పై తీవ్ర అభ్యంతరం చెప్పింది... ఆ వ్యాఖ్యలు విజయసాయి రెడ్డి వెనక్కు తీసుకోవాలని, లేకపోతే తగిన విధంగా స్పందిస్తామని హెచ్చరించింది...
ఏపి పోలీస్ ఆఫీసర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రెసిడెంట్ శ్రీనివాస రావు, విజయసాయి రెడ్డి పై విరుచుకుపడ్డారు... సీనియర్ ఆఫీసర్ మీద, నిబద్దత కలిగిన ఆఫీసర్ మీద చేసిన వ్యాఖ్యలు వెంటనే వెనక్కు తీసుకోవాలని హెచ్చరించారు... మేము ప్రభుత్వానికి, ప్రజలకు పని చేస్తామని, చౌకబారు ఆరోపణలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు... అలాగే సిఎంఒ ఇన్‌ఛార్జి సతీశ్‌చంద్ర మీద చేసిన వ్యాఖ్యల పై కూడా కొంత మంది ఐఏఎస్ లు అభ్యంతరం చెప్పారు... సతీష్ చంద్ర ఎంత నిజాయితీ గల అధికారో, అందరికీ తెలుసు అని, ఇలాంటి వ్యాఖ్యలు వెనక్కు తీసుకుని, క్షమాపణ చెప్పాలని విజయసాయి ని కోరారు...