నిన్న బీహార్ ఎన్నికలు, వివిధ రాష్ట్రాల్లో జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు వచ్చాయి. అన్నిట్లో బీజేపీ ముందంజులో ఉండి విజయం సాధించింది. ముఖ్యంగా తెలంగాణాలో జరిగిన దుబ్బాక ఉప ఎన్నికలో బీజేపీ అనూహ్య విజయం సాధించింది. మెజారిటీ పెద్దగా ఎక్కువ లేకపోయినా, టీఆర్ఎస్ పై విజయం సాధించింది. ముఖ్యంగా దుబ్బాకలో గత మూడు సార్లుగా బీజేపీ నుంచి రఘునందన్ రావు పోటీ చేస్తూ వస్తున్నారు. ఆయన పై సానుభూతి ఉంది. ఇక సహజంగానే అక్కడ కాంగ్రెస్ వీక్, గతంలో వచ్చిన ఓట్లే ఇప్పుడు కాంగ్రస్ కు వచ్చాయి. అయితే ఇక్కడ బీజేపీ విజయం కన్నా, రఘునందన్ రావు ఎక్కువ పని చేసిందని భావిస్తున్నారు. ఇక మరో పక్క తెలంగాణాలో బీజేపీ మొదటి నుంచి ఒక శక్తిగానే ఉంది. గట్టి పోటీ ఇస్తూనే ఉంది. ఎంపీలుగా కూడా ఉన్నారు. తెలంగాణాలో అలాంటి చోట బీజేపీ గెలిచింది అంటే అర్ధం ఉంది. అయితే ఈ వెయ్యి ఓట్ల మెజారిటీ విజయం చూసి, ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ నేతలు ఉత్సాహ పడుతున్నారు. ఇక మా అడుగులు ఆంధ్రప్రదేశ్ వైపే అంటూ, ప్రగల్భాలు పలుకుతున్నారు. ఎంతో కొంత క్యాడర్ ఉండి, బలం ఉన్న తెలంగాణాలోనే వాళ్లకు ఉంది ఇద్దరు ఎమ్మేల్యేలు. టీఆర్ఎస్, కాంగ్రెస్ ని దాటుకుని రావాలి అంటే, ఈ స్థాయిలో పని చేస్తే, మరో రెండు టర్మ్ లకు, అక్కడ అధికారానికి దగ్గర కావచ్చు. అయితే అలాంటి చోటే, బీజేపీకి అధికారం అందని ద్రాక్ష అంటుంటే, ఇక్కడ బీజేపీ నేతలు మాత్రం, మేమే కాబోయే కింగ్ అంటున్నారు. విష్ణువర్ధన్ రెడ్డి లాంటి వాళ్ళు ట్విట్టర్ లో ప్రాసలతో ట్వీట్లు వేస్తుంటే, సోము వీర్రాజు లాంటి వాళ్ళు, ప్రెస్ మీట్లు పెట్టి మాదే అధికారం అంటున్నారు. అయితే ఏ పార్టీ అయినా అధికారం కోసమే పని చేస్తుంది. ఇందులో రెండో ఆలోచన లేదు. ఎంత చిన్న పార్టీ అయినా గెలుస్తుందని, ఇదే బీజేపీ, రెండు సీట్లు నుంచి దేశాన్ని ఏలే స్థాయికి వచ్చింది.

bjp 1112020 2

అయితే ఇక్కడ బీజేపీకి ఆ అవకాశమే లేదు. ఎందుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు అన్యాయం చేసారు, చేస్తూనే ఉన్నారు అనే భావన ప్రజల్లో ఉంది. అందుకే 2019లో, వీళ్ళు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చేసిన అన్యాయానికి, నోటా కంటే, ఇంకా చెప్పాలి అంటే రాష్ట్రాన్ని విడగొట్టిన కాంగ్రెస్ కంటే, బీజేపీకి తక్కువ సీట్లు ఇచ్చారు. 2019లో బీజేపీకి 0.84 శాతం ఓట్లు వస్తే, కాంగ్రెస్ కు 1.17 శాతం, నోటా కి 1.2 8 శాతం ఓట్లు వచ్చాయి. ఇది ఏపిలో బీజేపీ పరిస్థితి. ఈ 18 నెలల్లో ఏమైనా బలపదిండా అంటే, చంద్రబాబు నామస్మరణ ఎక్కువగా, జగన్ ని టార్గెట్ చేయటం అతి తక్కువగా కనిపిస్తుంది. మరి అధికార పార్టీకి తోక పార్టీ అనే అభిప్రాయంతో, కేంద్రం నుంచి విభజన హామీలు ఏమి పూర్తి కాకుండా, అమరావతిని ఆపేస్తే నోరు ఎత్తకుండా, పోలవరం ప్రాజెక్ట్ ని గాల్లో పెట్టి, ప్రత్యెక హోదాని పడుకోబెట్టిన బీజేపీ, ఇవేమీ ఏపి ప్రజలకు చేయకుండా ఎలా అధికారంలోకి వస్తుంది ? కోడి గుడ్లు ఇచ్చాం, అది ఇచ్చాం ఇది ఇచ్చాం అంటారు, ఇవన్నీ అన్ని రాష్ట్రాలకు ఇస్తారు, రాష్ట్రాల డబ్బులు తీసుకునే ఇస్తారు, కానీ ఏపికి మాత్రం ప్రత్యేకంగా విభజన చట్టం ఉంది. అది నెరవేర్చకుండా అన్యాయం చేస్తూ ఉంటే, ఈ సారి కూడా నోటా దాటలేరు. ప్రజలకు మేలు చేసే పనులు చేస్తేనే, బీజేపీ నేతలు కంటున్న కలలు సాకారం అయ్యేది. వైసిపీ, తెలుగుదేశం పార్టీలను ఓడించేది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read