నవంబర్ 14వ తేదీన తిరుపతికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా వస్తున్నారు. ఆ రోజున తిరుపతిలో సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశం జరగనుంది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఈ సమావేశానికి నేతృత్వం వహిస్తారు. ఈ సమావేశానికి దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులు అందరూ హాజరు అవుతారు. కర్ణాటక ఎలాగూ బీజేపీ ముఖ్యమంత్రి కాబట్టి ఆయన వస్తారు, తమిళనాడు సియం కూడా వస్తారనే సమాచారం ఉంది, కేరళ ముఖ్యమంత్రి కూడా వస్తారనే సంకేతాలు ఉన్నాయి. ఇక జగన్ మోహన్ రెడ్డి, ఎప్పుడూ అమిత్ షా మీటింగ్ మిస్ చేసుకోరు, అదీ మనది ఆతిధ్య రాష్ట్రం కాబట్టి జగన్ తప్పకుండా వస్తారు. ఇక తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ రాక పైన మాత్రం అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఆయన తిరుపతి రాక పై, ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం రాలేదని తెలుస్తుంది. సహజంగా సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశం అంటే, పక్క రాష్ట్రాలతో ఉన్న సమస్యలు చర్చిస్తారు. నీటి సమస్యలు, ఇతర ఆర్ధిక కష్టాలు, రావాల్సిన బాకీలు, ఇలా అనేక విషయాలు చర్చిస్తారు. అయితే ఇప్పటి వరకు ఈ సమావేశంలో ఏమి చర్చిద్దాం అని కేసీఆర్ ఒక సమీక్ష కూడా పెట్టలేదు. ఉన్నతాధికారులు మాత్రం, సమావేశంలో చర్చించాల్సిన అంశాలు రెడీ చేస్తున్నారని తెలుస్తుంది.

kcr 08112021 2

అయితే నిన్నటి కేసీఆర్ ప్రెస్ మీట్ తరువాత, ఆయన కేంద్రం పై యుద్ధం ప్రకటించారు. ఇక రేపటి నుంచి బీజేపీని చూస్తూ ఊరుకోం అంటూ ప్రకటించారు. దేశ వ్యాప్తంగా బీజేపీని ఎండగడతాం అంటూ ఆయన నిన్న పెట్టిన ప్రెస్ మీట్ ఒక సెన్సేషన్ అయ్యింది. రేపటి నుంచి కేంద్రం తీరుకి వ్యతిరేకంగా అన్ని జిల్లా కేంద్రాల్లో ధర్నాలు చేస్తాం అని, అవసరం అయితే ముఖ్యమంత్రి హోదాలో ఉన్న తాను కూడా ఢిల్లీకి వెళ్ళి కేంద్రం తీరుకి వ్యతిరేకంగా ధర్నా చేస్తాను అంటూ కేసీఆర్ ప్రకటించారు. బీజేపీ పై, ముఖ్యంగా కేంద్రం పై నిన్న కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు తరువాత, ఆయన తిరుపతికి వచ్చి, అమిత్ షా నేతృత్వంలో జరిగే సమావేశానికి రావటం అనుమానం అనే చెప్పాలి. లేదా వచ్చి నిరసన తెలుపుతారా అనేది చూడాలి. కేసీఆర్ రాకపోయినా, ఉన్నతాధికారుల బృందం మాత్రం వచ్చే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఏపి, తెలంగాణా మధ్య సాగు నీటి ప్రాజెక్ట్ లు, నీటి పంపకాలు, విద్యుత్ బకాయలు, రాష్ట విభజన చట్టంలో పెండింగ్ అంశాలు, ఇలా చాలా ముఖ్యమైన సమస్యలు ఉన్నాయి. మరి వీటి పై ఆ సమావేశంలో ఏమి నిర్ణయం తీసుకుంటారో మరి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read