Sidebar

07
Wed, May

తెలంగాణా రాష్ట్రంలో మీడియా సంగతి ఎలా ఉందో చెప్పే పనే లేదు. తెలంగాణాలో ఎన్నో సమస్యలు ఉన్నా, కనీసం వార్తల్లో రావు. ఎంత సేపు కేటీఆర్ కు సినిమా వాళ్ళు చేసిన భజన తప్పితే తెలంగాణా వార్తలు నుంచి ఏమి ఉండవు. అదే ఆంధ్రాలో అయితే, చీమ చిటుక్కు మన్నా, ఇక ప్రపంచం అంతం అయిపోతుంది అన్నంత కలరింగ్ ఇస్తుంది హైదరాబాద్ మీడియా. అలాంటి హైదరాబాద్ మీడియా, ఎన్నికల సమయంలో కూడా వెన్నుముక లేకుండా కేసీఆర్ ను మోస్తుంది. ఒక పక్క సోషల్ మీడియాలో కేసీఆర్ ను ఉతికి ఆరేస్తుంటే, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో మాత్రం ఏమి లేదు.

kcrmedia 18112018 2

తెరాస అభ్యర్ధి కనిపిస్తే తరిమి తరిమి కొడుతున్న వీడియోలో సోషల్ మీడియాలో అనేకం చూస్తుంటే, టీవీ చానల్స్ లో మాత్రం, అవేమి ఉండవు. ఎంత సేపు కేసీఆర్ ని ఆహా ఓహో అనటం, కూటమిలో లుకలుకలు అని చెప్పటమే. అయితే, మారుతున్న రాజకీయ పరిస్థితులో మరేదన్నా కాని, కెసిఆర్ కు సన్నిహితంగా ఉండే మీడియా అధినేత మాత్రం, ఈ మధ్య కొంచెం ఓపెన్ అప్ అవుతున్నారు. మాకు పరిమితులు ఉన్నాయి అని చెప్తూ, తెలంగాణాలో మీడియా స్వేఛ్చ గురించి చెప్పకనే చెప్తున్నారు. మా ఒత్తిడిలు మాకు ఉంటాయి, కాని సోషల్ మీడియా అలా కాదు అని వాస్తవం చెప్తున్నారు.

kcrmedia 18112018 3

మీడియా కూడా విశ్వసనీయత కోల్పోతున్న వ్యవస్థల జాబితాలో చేరిపోతోంది అంటూ తెలంగాణాలో వాస్తవ పరిస్థితి చెప్పకనే చెప్పారు. ప్రగతి నివేదన సభ పేరిట తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కొంగరకలాన్‌లో నిర్వహించిన భారీ బహిరంగసభ విఫలమైనప్పటికీ ప్రధాన మీడియా ఆ విషయాన్ని పట్టించుకోలేదని, సోషల్ మీడియాలో మాత్రం, ఉతికి ఆరేసిందని అన్నారు. మొత్తానికి ఒక వాయిస్ తెలంగాణా నుంచి గట్టిగానే లేగిసే సూచనలు కనిపిస్తున్నాయి. మళ్ళీ కేసీఆర్ గెలుస్తాడు అంటే, ఈ సాహసం చేసే వారు కాదేమో. కేసీఆర్ ఓడిపోయే సూచనలు కనిపిస్తున్నాయి కాబట్టే, మీడియా నెమ్మిదిగా ఓపెన్ అవుతుంది. కనీసం ఈ 20 రోజుల్లో అయినా తెలంగాణా ప్రజలకు వాస్తవాలు చూపిస్తారని ఆశిద్దాం...

Advertisements

Advertisements

Latest Articles

Most Read