ఈ రోజు నెల్లూరులో జగన్ చేసిన వ్యాఖ్యలు సంచలనం కలిగిస్తున్నాయి. ఓట్ల తొలగింపు విషయంలో వైసీపీ ప్రమేయం ఉందని వైఎస్ జగన్ ఒప్పుకున్నారు. వైసీపీ తరపున ఫాం-7 విరివిగా ఈసీకి ఇచ్చిన మాట నిజమేనని ఆయన తెలిపారు. టీడీపీ దొంగ ఓట్లు లక్షల కొద్ది నమోదు చేయించిందని, కాబట్టే.. ఓట్లు తొలగించేలా ఫాం-7 పెట్టామన్నారు. నెల్లూరు సభలో జగన్‌ ఇదే మాటను స్పష్టంగా చెప్పారు. అసలు ఫాం-7 తో జగన్ కు ఏమి సంబంధం ? ఇలా చెయ్యవచ్చా ? ఒకరి ఓటు వారికే తెలియకుండా, ఇలా ఎవరూ పడితే వారు ఓట్లు తొలగించవచ్చా ? అనే వాదనలు మొదలయ్యాయి. చట్ట ప్రకారం జగన్ చేసిన పని నేరం అని విశ్లేషకులు చెప్తున్నారు. అయితే ఇప్పుడు జగన్, ఈ విషయం చెప్పిన తరువాత మరో సంచలన విషయం బయట పడింది.

viveka 05032019

కొన్ని రోజల క్రితం, జగన్ బాబాయి వైఎస్ వివేకా ఓటు పోయింది అంటూ హడావిడి చేసారు. అయితే ఇప్పుడు జగన్ స్వయంగా ఒప్పుకోవటంతో, వైఎస్ వివేకా ఓటు కూడా, ఫాం-7 తో జగనే స్వయంగా తొలగించారా అనే అనుమానం కలుగుతుంది. ఎందుకంటే, ఇప్పటికే జగన కు, ఆయన బాబాయి , వైఎస్ వివేకా కు మధ్య కోల్డ్ వార్ నడుస్తుంది. ఆస్తుల గొడవలతో పాటు, టికెట్ విషయంలో కూడా, కుటుంబంలో గొడవలు జరుగుతున్నాయి. ఈ తరుణంలో ఒకానొక సమయంలో , వైఎస్ వివేకా తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారని, ఇప్పటికే చంద్రబాబుతో టచ్ లో ఉన్నారనే, ప్రచారం బలంగా జరిగింది. ఈ నేపధ్యంలోనే, జగన్ , ఫాం-7 ఏకంగా సొంత బాబాయి వైఎస్ వివేకా ఓటు కూడా తీయించారా అనే చర్చ కూడా మొదలైంది.

viveka 05032019

మరో పక్క, రాష్ట్రవ్యాప్తంగా ఓట్ల తొలగింపు కోసం 8 లక్షల దరఖాస్తులు వచ్చాయని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈసీ) గోపాలకృష్ణ ద్వివేది చెప్పారు. అర్హులైన ఓటర్ల పేర్లను అక్రమంగా తొలగించేందుకు భారీగా ఫారమ్‌-7 దరఖాస్తులు దాఖలు చేస్తున్నారంటూ ఆరోపణలు రావడంతో ఈ విషయంపై సీఈసీ స్పందించారు. గత పది రోజుల్లోనే 6 లక్షల దరఖాస్తులు అందాయన్నారు. ఓట్ల తొలగింపు కోసం వస్తున్న అక్రమ దరఖాస్తులపై కేసులు నమోదు తర్వాత ఫారం-7 దరఖాస్తులు తగ్గాయన్నారు. 9 జిల్లాల్లో క్రిమినల్‌, ఐటీ, ప్రజాప్రాతినిధ్య (పీఆర్‌) చట్టాల్లో వివిధ సెక్షన్ల కింద 45 కేసులు నమోదు చేసినట్లు ద్వివేది తెలిపారు. శ్రీకాకుళం జిల్లాలో 3 కేసులు, తూర్పు గోదావరి-14, కృష్ణా-3, గుంటూరు-1, ప్రకాశం-4, చిత్తూరు-3, అనంతపురం-1, కర్నూలు-8, విశాఖపట్నం జిల్లాలో 8 కేసులు నమోదయ్యాయన్నారు. దొంగ దరఖాస్తులకు సహకరిస్తున్న తూర్పుగోదావరి జిల్లాలోని మీసేవా సెంటర్లలో పని చేస్తున్న ఆరుగురు సిబ్బందిపై క్రిమినల్‌ చర్యలు తీసుకోవాలని ఆ జిల్లా కలెక్టర్‌ను ఆదేశించినట్లు వెల్లడించారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read