ఎలాగైనా చంద్రబాబుని ఇబ్బంది పెట్టాలి.. అలా చెయ్యాలి అంటే, చంద్రబాబుకి సహకరించే వారిని ముందు ఇబ్బంది పెట్టాలి... ఫాక్షన్ ఆలోచనలు అంటారు వీటిని.. ఇలాంటి అలోచనే ఇప్పుడు కేంద్రం చేస్తుంది. రాష్ట్రంలో భయభ్రాంతులకి గురి చేస్తున్నారు. అదేమంటే, దాడులు జరిగితే భయం దేనికి, కడిగిన ముత్యం లాగా బయటకు రండి అంటూ ఫోజులు కొడుతున్నారు. అసలు ఇప్పటి వరకు జరిగిన దాడుల్లో రూపాయి అయినా అక్రమం అని తేల్చారా అంటే, లేదు ? మరి ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు అంటే, చంద్రబాబును సాధించటానికి చేస్తున్నారు. తాజాగా ఇప్పుడు మరో సంచలన విషయం బయట పడింది. చంద్రబాబుకి సన్నిహితంగా ఉండే వారిని ఇబ్బంది పెట్టే పెద్ద ఆపరేషన్ మొదలు పెట్టారు.

it 14102018 2

చంద్రబాబుని డైరెక్ట్ గా టచ్ చేసే దమ్ము లేక డ్రామాలు ఆడుతున్నారు. ఐటీ శాఖ చాలా లోతుల్లోకి వెళ్లి మరీ లావాదేవీలపై ఆరా తీస్తోంది. ‘‘గత నాలుగేళ్లుగా భారీగా లావాదేవీలు జరిగిన ఖాతాల వివరాలన్ని మాకు చెప్పండి’ అంటూ బ్యాంకులకు ఐటీ నుంచి లేఖలు వెళ్లినట్లు తెలిసింది. ఇటీవలికాలంలో జాగ్రత్త పడినప్పటికీ... పాత లెక్కలను తీసి పక్కాగా పట్టుకోవచ్చునని అధికారులు భావిస్తున్నట్లు సమాచారం.మరీ ముఖ్యంగా... తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి వివిధ కంపెనీలు, సంస్థలు నిర్వహించిన లావాదేవీల వివరాలను పలు బ్యాంకులనుంచి ఐటీ శాఖ సేకరిస్తున్నట్లు తెలిసింది.

it 14102018 3

లక్ష్యంగా నిర్ణయించుకున్న కంపెనీల బ్యాంకు ఖాతాలపై దృష్టి సారించారు. ఒకచోట తీగ దొరికితే గొలుసుకట్టుగా డొంకను కదిలించుకుంటూ వెళ్లిపోతున్నారు. ఈ వ్యవహారం క్రమంగా వ్యాపార వర్గాల్లోకి చేరుతుండడంతో గుబులు మొదలైంది. ఇటీవల 200 మంది సిబ్బంది 19 బృందాలుగా విడిపోయి వీర విహారం చేశారు. ఒకరోజు, రెండు రోజులు కాకుండా... రోజుల తరబడి అదే పనిగా వేడి కొనసాగిస్తున్నారు. దీంతో ఈ వ్యవహారంతో సంబంధం లేని వారు కూడా బెంబేలెత్తుతున్నారు. పలువురు రియల్టర్లు, వ్యాపారులు అసలు ఇప్పుడేమీ కొత్త లావాదేవీలు వద్దు, ఒప్పందాలు, రిజిస్ర్టేషన్లు వద్దే వద్దు అన్న స్థాయికి వెళ్లిపోయారు. పెద్ద మొత్తంలో లావాదేవీలు నిర్వహించేవాళ్లే కాకుండా...ఒక మాదిరిగా వ్యాపారాలు చేసేవారూ టెన్షన్‌ పడుతున్నారు. బీజేపీకి కావాల్సింది కూడా ఈ భయమే. అది సృష్టించటంలో ఇప్పటికి సక్సెస్ అయ్యారు. 2019లో ప్రజల టైం వస్తుంది. అప్పుడు వాళ్ళు ఇవ్వాల్సిన తీర్పు ఇస్తారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read