ఐటీ గ్రిడ్ కేసు దర్యాప్తులో జోక్యం చేసుకోలేమని హైకోర్టు తేల్చిచెప్పింది. ఈ సందర్భంగా కంపెనీ డైరెక్టర్ అశోక్ వేసిన హెబియస్‌ కార్పస్ పిటిషన్ కొట్టివేయడం జరిగింది. ఐటీగ్రిడ్ కేసులో ఎవరినీ అరెస్ట్ చేయలేదని.. విచారణ కోసమే పిలిచామని తెలంగాణ ఐజీ బీఎస్ ప్రసాద్ స్పష్టం చేశారు. సోమవారం మధ్యాహ్నం తమ ఆధీనంలో నలుగుర్ని న్యాయమూర్తి ఇంట్లో పోలీసులు హాజరుపరిచారు. హెబియస్ కార్పస్ కేసు కొట్టివేసినప్పటికీ పోలీస్ ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుందని ఉన్నతాధికారులు స్పఫ్టం చేశారు. ఈ సందర్భంగా నలుగురికీ 160 సీఆర్పీసీ నోటీసులు అందించి విచారణ కోసమే పిలిచామని ప్రసాద్ స్పష్టం చేశారు. జడ్జి దగ్గర హాజరుపరిచిన అనంతరం ఆ నలుగుర్నీ పోలీసులు వదిలేసినట్లు అడ్వకేట్ జనరల్ ప్రసాద్ తెలిపారు.

caes 04032109

ఇది ఇలా ఉంటే, తెలంగాణా ప్రభుత్వం మరో గేమ్ మొదలు పెట్టింది. ఐటీ గ్రిడ్ కేసు దర్యాప్తులో జోక్యం చేసుకోలేమని హైకోర్టు తేల్చిన అనంతరం.. కంపెనీ డైరెక్టర్ అశోక్ వేసిన హెబియస్‌ కార్పస్ పిటిషన్ కొట్టేసింది. దీంతో ఇప్పటి వరకు ఈ కేసులో ఏమి దొరక్కపోవటం, అలాగే హైకోర్ట్ లో తెలంగాణా ప్రభుత్వం దోషిగా నిలబడటంతో, ఎలాగైనా ఎదో ఒకటి చెయ్యటానికి, ఐటీ గ్రిడ్స్‌ సంస్థపై మరో కేసు నమోదు చేసారు. సేవా మిత్ర యాప్‌ పేరుతో ప్రభుత్వ లబ్ధిదారుల డేటాను చోరీ చేశారంటూ ఎస్సార్‌నగర్ పోలీస్‌స్టేషన్‌లో ఐటీ గ్రిడ్స్‌పై వైసీపీ యువజన విభాగానికి చెందిన రామ్ రెడ్డి ఫిర్యాదు చేశారు. సేవా మిత్ర యాప్ ద్వారా ఏపీ ప్రజల డేటాను ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై ఎస్సార్‌ నగర్‌ పోలీసులు విచారణ చేపట్టారు.

caes 04032109

తెలుగుదేశం పార్టీకి చెందిన యాప్.. సేవామిత్ర సమాచారం మొత్తం సేకరించడానికే…” ఐటీ గ్రిడ్” కంపెనీని పోలీసులు టార్గెట్ చేశారని.. టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ సమయంలో.. లోకేశ్వర్ రెడ్డి అనే వ్యక్తి ఫిర్యాదు వర్కవుట్ కావడం లేదని.. కొత్తగా మరో ఫిర్యాదు చేయించారని.. దానికి నేరుగా.. టీడీపీయాప్ పేరును ప్రస్తావించారని ప్రచారం జరుగుతోంది. మొత్తానికి.. ఈ కేసు మరిన్ని మలుపులు తిరిగే అవకాశం కనిపిస్తోంది. మంగళవారం నుంచి కోర్టు పని దినాలు ప్రారంభమవుతాయి. ఈ విషయంలో.. కోర్టులోనే తేల్చుకునేందుకు ఏపీ ప్రభుత్వం పక్కాగా ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుతో అడ్వకేట్ జనరల్, డీజీపీ ఆర్పీ రాకూర్ సోమవారం ఉదయం భేటీ అయ్యారు. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో వారు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా హైదరాబాద్ లోని ఐటీ గ్రిడ్‌ కంపెనీ వ్యవహారంపై సమీక్ష నిర్వహించారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read