నలుగురు సహచర ఉద్యోగులను పోలీసులు అక్రమంగా నిర్బంధించారంటూ ఐటీ గ్రిడ్‌ సంస్థ ఉద్యోగి అశోక్‌ తెలంగాణ హైకోర్టులో హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. రేగొండ భాస్కర్‌, ఫణి కడలూరి, గురుడు చంద్రశేఖర్‌, విక్రమ్‌ గౌడ్‌ను పోలీసులు నిర్బంధించారంటూ పిటిషన్‌లో పేర్కొన్నారు. నలుగురు ఉద్యోగులను వెంటనే కోర్టు ముందు హాజరుపరిచేలా పోలీసులను ఆదేశించాలని కోరారు. ఇవాళ, రేపు హైకోర్టు సెలవులు ఉన్న నేపథ్యంలో ఇంట్లోనే విచారణ జరపాలని న్యాయమూర్తికి విజ్ఞప్తి చేశారు. ఈ నలుగురిని కోర్టు ముందు హాజరుపరిచేలా తెలంగాణ పోలీసులను ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు. కాగా, ఈ పిటిషన్ ను మరికాసేపట్లో జడ్జి విచారించే అవకాశముందని భావిస్తున్నారు.

highcourt 03022019

తెలుగుదేశం పార్టీకి ఐటీ సేవలందిస్తున్న హైదరాబాద్‌లోని మాదాపూర్‌ అయ్యప్ప సొసైటీలో ఉన్న ఐటీ గ్రిడ్ సంస్థ కార్యాలయంలో సైబరాబాద్‌ పోలీసులు శనివారం సాయంత్రం సోదాలు నిర్వహించారు. కొన్ని హార్డ్‌డిస్క్‌లు, ల్యాప్‌టాప్‌లను స్వాధీనం చేసుకోవడంతో పాటు సంస్థకు చెందిన ఇద్దరు ప్రతినిధులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ సంస్థ తెలుగుదేశం పార్టీకి యాప్‌ తయారుచేసి ఇచ్చిందని, దీనిలో ఓటర్లు, వారి ఆధార్‌ కార్డుల వివరాలతో పాటు ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల సమాచారం ఉందని వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఇది కేవలం పార్టీకి చెందిన డేటా అని, తెలంగాణా పోలీసులకి ఈ డేటా ఇచ్చే పనే లేదని, కోర్ట్ లోనే ఈ విషయం తేల్చుకుంటామని తెలుగుదేశం అంటుంది.

highcourt 03022019

మరో పక్క తెలుగుదేశం పార్టీ కూడా, ఈ వ్యవహారం పై ఫైర్ అయ్యింది. ఆంధ్రప్రదేశ్‌పై భారీ కుట్రకు వైసీపీ, బీజేపీ, టీఆర్‌ఎస్‌ ప్లాన్‌ చేస్తున్నాయని టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర ఆరోపించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏపీని అల్లకల్లోలం చేయడానికి అన్ని వ్యవస్థల దుర్వినియోగానికి కుట్ర చేస్తున్నాయని విమర్శించారు. ఎన్నికల సమయంలో ఎవరైనా ప్రైవేటు సంస్థల సేవలు వినియోగించుకుంటారని అన్నారు. ఏపీ ప్రజల డేటా ఉంటే ఏపీ పోలీసులకు ఫిర్యాదు ఇవ్వకుండా... తెలంగాణ పోలీసులకు వైసీపీ ఎలా ఫిర్యాదు చేసిందని ధూళిపాళ్ల ప్రశ్నించారు. అంతా కలిసి ఏపీపై కుట్రలు చేస్తే చూస్తూ కూర్చోమని ఆయన హెచ్చరించారు. కేసీఆర్‌కు అధికారం ఉంది కదా అని.. కళ్లు నెత్తికెక్కాయని ధూళిపాళ్ల తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read