ఆంధ్రప్రదేశ్ ఐటి మినిస్టర్ నారా లోకేష్ టీం, సీక్రెట్ గా సైలెంట్ గా పనులు చేసుకుంటూ వెళ్ళిపోతుంది... ఏ కంపనీతో మాట్లాడుతుంది, ఏ కంపనీ రాష్ట్రానికి తీసుకురావటానికి ప్రయత్నిస్తుంది అన్నీ సీక్రెట్ గా ఉంచుతున్నారు... అవగాహన ఒప్పందం కుదిరే ముందు రోజు మాత్రమే బయటకు ప్రకటిస్తున్నారు... ఇతర రాష్ట్రాల నుంచి పోటీని తట్టుకుని ఐటీ కంపెనీలను ఆకర్షించేందుకు అనుసరిస్తున్న వ్యూహమిది.. ఎందుకంటే, మనకి ఇక్కడ హైదరాబాద్, బెంగుళూరు, చెన్నై లాగా అన్ని సౌకర్యాలు లేవు... బయటకు తెలిస్తే, వాళ్ళు ఎక్కడ తన్నుకుపోతారో అని గోప్యత పాటిస్తుంది లోకేష్ టీం...
మనకి సరైన వసతులు లేకపోయినా, పట్టువదలని విక్రమార్కుడిలా వ్యవహరిస్తోంది. చాణుక్యుడిలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఐటీ కంపెనీలను రాష్ట్రానికి ఆకర్షిస్తోంది. ఒక పక్క చంద్రబాబు బ్రాండ్ ఇమేజ్, మరో పక్క రాయితీలు కల్పిస్తామని ఐటీ కంపెనీలను రాష్ట్రానికి వచ్చేలా చేయడంలో రాష్ట్ర ఐటీ శాఖ సక్సెస్ అవుతుంది. ఇటీవల గూగుల్ ఎక్స్ కంపెనీ రాష్ట్రానికి వచ్చేందుకు ఒప్పందం కుదిరింది. దానిపై గత ఆరునెలలుగా కసరత్తు జరుగుతోంది. కాని ఒప్పందం అయ్యేదాకా ఎవరికీ తెలీదు... అదేవిధంగా ఫ్రాంక్లిన్ టెంపుల్టన్, కాన్‌డ్యుయెంట్, ఏఎన్ఎస్ ఆర్, ఫిడెలిటీ తదితర కంపెనీల విషయంలోనూ అదే వ్యూహాన్ని అనుసరించారు. ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ కంపెనీ విశాఖపట్నంలో జనవరిలో తన కార్యకలాపాలు ప్రారంభించనుంది. ఈ సంస్థ 2,800 మందికి ఉద్యోగాలు కల్పించనుంది.
కాండ్యుయెంట్ కంపెనీ కూడా జనవరిలోనే విశాఖకు రానుంది. ఫలితంగా 5 వేల మందికి ఉద్యోగాలు లభిస్తాయి. జనవరిలో మంగళగిరి ఐటీ పార్కులో సుమారు 12 కంపెనీలు కార్యకలాపాలు ప్రారంభిస్తాయి. గన్నవరం సమీపంలోని మేథా టవర్స్‌లో ఒక పెద్ద ఐటీ కంపెనీ రానుంది. ఈ కంపెనీ ద్వారా 900 మందికిపైగా ప్రత్యక్షంగా ఉద్యోగాలు రానున్నాయి. ఇతర రాష్ట్రాల నుంచి పోటీ ఉన్నందున కంపెనీ పేరును ప్రస్తుతానికి బహిరంగపర్చడం లేదు. మరోవైపు ఒక ప్రముఖ ఎలక్ర్టానిక్స్ కంపెనీని జనవరిలో రాష్ట్రానికి తెచ్చేందుకు ఐటీ శాఖ మంత్రి లోకేశ్ కృషి చేస్తున్నారు. ఇప్పటికే రెండుసార్లు ఆ కంపెనీ ప్రతినిధులతో భేటీ అయ్యారు. ఇక్కడ లోకేష్ టీం మరో వ్యుహ్యం కూడా అములు చేస్తుంది, ఒప్పందం కుదుర్చుకుని, కంపనీ పెట్టేనాటికి, కంపెనీ మనసు మార్చుకునే వెళ్ళిపోయే ప్రమాదం ఉంది అని గ్రహించి, ‘ప్లగ్ అండ్ ప్లే’ విధానంలో తొలుత కంపెనీలను ప్రారంభించేందుకు అవసరమైన అన్ని సౌకర్యాలను రాష్ట్ర ఐటీ శాఖ కల్పిస్తోంది. ఫలితంగా ముందు ఆయా కంపెనీలు రాష్ట్రంలో కార్యకలాపాలు ప్రారంభించడంతోపాటు, యువతకు ఉద్యోగ అవకాశాలు దక్కుతున్నాయి.