ఆపరేషన్ గరుడలో చెప్పిన ప్రతి ఒక్కటి పొల్లు పోకుండా, షడ్యుల్ ప్రకారం జరుగుతుంది. ఎన్డీఏ నుంచి బయటకు వచ్చిన తరువాత, మోడీ పై చంద్రబాబు చేస్తున్న రాజకీయ పోరాటంతో, గుజరాత్ బ్రదర్స్ మోడీ, షాలు చంద్రబాబు పై కక్ష పెంచుకున్నారు. గత మూడు నాలుగు నెలలుగా చంద్రబాబు అంతు చూస్తాం, చంద్రబాబుని జైల్లో పెడతాం, చంద్రబాబుని పదవిలో నుంచి దించేస్తాం అంటూ బహిరంగంగానే బీజేపీ నేతలు మాట్లాడటం చూసాం. దానికి తగ్గట్టుగానే కోర్ట్ ల్లో కేసులు వేసినా, ఏమి లాభం లేకపోవటంతో, ఇప్పుడు తమ చేతుల్లో ఉన్న ఐటి, ఈడీ, సిబిఐ లకు ఢిల్లీ పెద్దలు పని చెప్పారు. ఇప్పటికే తెలంగాణాలో రేవంత్ రెడ్డి పై దాడులు చేసి, దానికి చంద్రబాబుకు లంకె పెట్టే ప్రయత్నం చేసి విఫలం అయ్యారు.
చంద్రబాబు, లోకేష్ మీద డైరెక్ట్ గా దాడి చేస్తే, అది దేశ వ్యాప్తంగా సంచలనం అయ్యి, అన్ని విపక్షాలు మరింత బలంగా ఏకం అయ్యే అవకాసం ఉండటంతో, తెలుగుదేశం పార్టీలో ఆర్ధికంగా బలంగా ఉన్న నేతల పై, తెలుగుదేశం పార్టీకి సానుకూలంగా ఉన్న వ్యాపార వేత్తల పై, దాడులకు ఢిల్లీ నేతలు సిద్ధం అయ్యారు. ఇందులో భాగంగా, నిన్న రాత్రి, వేర్వేరు ప్రాంతాలకు చెందిన ఆదాయపు పన్ను శాఖ అధికారులు గురువారం రాత్రి విజయవాడకు చేరుకున్నారు. శుక్రవారం ఉదయం దాడులకు సిద్ధంగా ఉండాలని పోలీసు అధికారులను ఐటీ బృందాలు కోరడం జరిగింది. మరి కాసేపట్లోనే ఈ దాడులు ప్రారంభం అయ్యే అవకాశం ఉంది.
అయితే ముఖ్యంగా ఒకే సామాజికవర్గాన్ని టార్గెట్ గా చేసుకుని ఈ దాడులు జరగనున్నాయి. కృష్ణా జిల్లాలో ఒక ఎంపీ, గుంటూరు జిల్లాలో ఒక మంత్రి వారికి మెయిన్ టార్గెట్ అని తెలుస్తుంది. గురువారం నెల్లూరులో తెదేపా నాయకుడు బీద మస్తాన్‌రావు కార్యాలయాల్లోనూ తనిఖీలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో విజయవాడకు ఆదాయపు పన్ను శాఖ బృందాలు చేరుకోవడం రాజకీయంగా కలకలం సృష్టిస్తోంది. భారీగా బృందాలు విజయవాడకు చేరుకోవడంతో స్థానికంగా ఉన్న నేతలు అలర్ట్ అయినట్లుగా తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఏకకాలంలో పలువురు రాజకీయ నేతల ఇళ్లలో ఐటీ సోదాలు జరిగే అవకాశాలు మెండుగా ఉన్నాయి. నిన్న ఉదయమే చంద్రబాబు కూడా ఈ విషయం పై నేతలను హెచ్చరించారు. మన మీద బాగా కసిగా ఉన్నారు, ఏదైనా జరగోచ్చు సిద్ధంగా ఉండండి అని, చెప్పిన కొద్ది సేపటికే, ఐటి అధికారులు విజయవాడలో వాలిపోయారు.