బీజేపీ నాయకులు బెదిరించినట్టుగానే, తెలుగుదేశం పార్టీ నేతల పై ఐటి దాడులు మొదలయ్యాయి. మొన్న మొన్న విజయవాడ వచ్చి, నాయకుల పై దాడులు చేద్దాం అని ప్లాన్ చేసినా, అది లీక్ కావటంతో, తెలుగుదేశం సానుకూల వ్యాపారస్తుల పై దాడులు చేసారు. అయితే ఇప్పుడు డైరెక్ట్ గా తెలుగుదేశం ఎంపీ సియుం రమేష్ పై పడ్డారు. మొన్న కడప ఉక్కు ఫ్యాక్టరీ కోసం ఆమరణ దీక్ష చేస్తున్న సందర్భంలోనే, నీ అంతు చుస్తామంటూ బీజేపీ నాయకులు బెదిరించిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలోనే సియం రమేష్ పై దాడులు ప్రారంభించి, భయబ్రాంతులకు గురి చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఏకకాలంలో హైదరాబాద్, కడప జిల్లాలో ప్రారంభమైన ఈ దాడుల్లో 60 మంది ఐటీ అధికారులు పాల్గొన్నారు.
సీఎం రమేష్ నివాసాలు, వ్యాపార సంస్థల్లో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్‌లోని సీఎం రమేష్ నివాసం, ఆఫీసుల్లో తనిఖీలు జరుగుతున్నాయి. కడప జిల్లా పోట్లదుర్తిలోని సీఎం రమేష్ నివాసంలోనూ సోదాలు చేస్తున్నారు. ఎంపీ సోదరుడి నివాసంలోనూ సోదాలు సాగుతున్నాయి. సీఎం రమేష్ ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నారు. కేంద్ర పీఏసీ సభ్యుడిగా ఉన్న సీఎం రమేష్ ఢిల్లీలో జరిగిన పీఏసీ సమావేశంలో... దేశంలో ఐటీ దాడులు ఎక్కడ, ఎందుకు చేస్తున్నారు, ఏపీలో దాడుల వివరాలు ఇవ్వాలంటూ ఐటీకి ఆయన నోటీసులు జారీ చేశారు.
నోటీసులు జారీ చేసిన మూడు రోజుల్లోనే రమేష్ ఆస్తులపై దాడులు జరుగుతున్నాయి. మరోవైపు కడప ఉక్కు పరిశ్రమ కోసం ఆమరణ నిరాహార దీక్ష చేసి నేటికి వందో రోజు పూర్తైన సందర్భంగా టీడీపీ ఎంపీలు కేంద్ర ఉక్కు శాఖ మంత్రితో భేటీ అవ్వాలని నిర్ణయించారు. కడప ఉక్కు పరిశ్రమ ఏర్పాటుపై స్పష్టత ఇవ్వాలని కేంద్రమంత్రిని ఎంపీలు కోరనున్నారు. ఇందుకోసం ఎంపీల బృందం ఢిల్లీకి చేరుకుంది. కడప ఉక్కు పరిశ్రమపై ప్రశ్నిస్తున్నందుకే సీఎం రమేష్ ఇంట్లో ఐటీ సోదాలు చేపట్టిందని టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.