కేంద్రం పగ బట్టేసింది. గ్యాప్ కూడా ఇవ్వకుండా, మన రాష్ట్రం పై విరుచుకుపడుతుంది. ఇప్పటికే విజయవాడలో ఐటి దాడులు చేసిన ఐటి అధికారులు, కొన్ని రోజుల క్రిందట సియం రమేష్ పై దాడులు చేసారు. మొత్తం వాతావరణం అంతా టెన్షన్ లో దింపుతున్నారు. ఆపరేషన్ గరుడలో చెప్పిన ప్రతి ఒక్కటి పొల్లు పోకుండా, షడ్యుల్ ప్రకారం జరుగుతుంది. ఎన్డీఏ నుంచి బయటకు వచ్చిన తరువాత, మోడీ పై చంద్రబాబు చేస్తున్న రాజకీయ పోరాటంతో, గుజరాత్ బ్రదర్స్ మోడీ, షాలు చంద్రబాబు పై కక్ష పెంచుకున్నారు. గత మూడు నాలుగు నెలలుగా చంద్రబాబు అంతు చూస్తాం, చంద్రబాబుని జైల్లో పెడతాం, చంద్రబాబుని పదవిలో నుంచి దించేస్తాం అంటూ బహిరంగంగానే బీజేపీ నేతలు మాట్లాడటం చూసాం. దానికి తగ్గట్టుగానే కోర్ట్ ల్లో కేసులు వేసినా, ఏమి లాభం లేకపోవటంతో, ఇప్పుడు తమ చేతుల్లో ఉన్న ఐటి, ఈడీ, సిబిఐ లకు ఢిల్లీ పెద్దలు పని చెప్పారు.

it 241020018 2

చంద్రబాబు, లోకేష్ మీద డైరెక్ట్ గా దాడి చేస్తే, అది దేశ వ్యాప్తంగా సంచలనం అయ్యి, అన్ని విపక్షాలు మరింత బలంగా ఏకం అయ్యే అవకాసం ఉండటంతో, తెలుగుదేశం పార్టీలో ఆర్ధికంగా బలంగా ఉన్న నేతల పై, తెలుగుదేశం పార్టీకి సానుకూలంగా ఉన్న వ్యాపార వేత్తల పై, దాడులకు ఢిల్లీ నేతలు సిద్ధం అయ్యారు. ఇందులో భాగంగా, ఇప్పటికే విజయవాడ, గుంటూరులో దాడి చేసిన ఐటి అధికారులు, ఇప్పుడు వైజాగ్ పై దాడికి రెడీ అయ్యారు. ఇందులో భాగంగా విశాఖకు భారీగా ఐటీ ఉన్నతాధికారులు చేరుకున్నారు. రేపు విశాఖలో భారీగా ఐటీ దాడులు జరిగే అవకాశం ఉందనే సమాచారం వస్తుంది. నగరంలో పలు హోటళ్లలో ఐటీ అధికారులు బస చేసారు.

it 241020018 3

తెలంగాణ, ఒడిశా, చెన్నై, బెంగళూరు నుంచి వచ్చిన అధికారులు, దాదపు 200 మంది ఉన్నారని తెలుస్తుంది. వివిధ మార్గాల నుంచి సాయంత్రం 5 గంటల ప్రాంతంలో విశాఖకు ఐటీ అధికారులు చేరుకున్నారు. ప్రధానంగా తెలుగుదేశం మంత్రి టార్గెట్ గా ఈ దాడులు చేస్తామని ఐటి అధికారులు లీకులు ఇస్తున్నారు. మొన్న చనిపోయిన మూర్తి వ్యాపార సంస్థల పై కూడా దాడులు చేసే అవకాసం ఉన్నట్టు తెలుస్తుంది. అలాగే విజయవాడలో చేసినట్టు, తెలుగుదేశం పార్టీకి సానుకూలంగా ఉన్న వ్యాపార వర్గాల పై కూడా దాడులు చేస్తారని సమాచారం. మొత్తంగా, నవ్యాంధ్రకు ఆయువపట్టు లాంటి వైజాగ్ లో, ఇప్పుడిప్పుడే ఫిన్టెక్ హబ్ గా, ఐటి హబ్ గా రూపాంతరం చెందుతున్న వైజాగ్ పై తప్పుడు ముద్ర వేసేందుకు, ఇలా దాడులు చేపిస్తున్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read