పార్లమెంట్‌లో కేంద్రాన్ని ప్రశ్నించినందుకే తన ఇంటిపై ఐటీశాఖతో దాడులు చేయించారని తెదేపా సీనియర్‌ నేత, రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్‌ విమర్శించారు. తన ఇంట్లో ఐటీ సోదాలపై ఆయన ఎన్టీఆర్‌ ట్రస్ట్‌భవన్‌లో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా సియం రమేష్ చెప్పిన మాటలు చూస్తూ, మోడీ-షా ఎంతకు దిగాజారిపోయరో అర్ధమవుతుంది. కెసిఆర్ ఎలా అయితే నకిలీ ఐటి దాడులు చేపించారో, ఇంచు మించు అలాంటిదే ఇక్కడ కూడా జరిగింది. కాకపోతే ఇక్కడ నిజమైన ఐటి అధికారులు వచ్చినా, వారెంట్ మాత్రం తప్పుడు వారెంట్.

itwist 14102018

సియం రమేష్ మాట్లాడుతూ, ఐటీ అధికారులు తప్పుడు వారెంటుతో వచ్చారని తెలిపారు. తన భార్య పేరుతో సెర్చ్‌ వారెంట్‌ తీసుకుని వచ్చారని.. రిత్విక్‌ అగ్రిఫామ్స్‌లో ఆమె డైరెక్టర్‌ కాదని వివరించారు. తప్పుడు సమాచారంతో వచ్చి హడావుడి చేశారని మండిపడ్డారు. తనిఖీలకు కారణం చెప్పమంటే ఐటీ అధికారులు చెప్పలేదన్నారు. ఈ విషయం పై వదిలిపెట్టను అని, దీని పై నాకు సరైన వివరణ ఇచ్చే దాకా ఎంత వరకు అయినా వెళ్తానని అన్నారు. ఇప్పటి వరకు ఐటి అధికారులకు భయపడి ఎవరూ మాట్లాడలేదని, నేను మాత్రం ఇలా కక్ష సాధింపు చేసే వారిని వదిలిపెట్టే సమస్య లేదని అన్నారు. తన తలతీసినా తాను బెదిరిపోయేది లేదన్నారు. తాను పోయినా... తన కుటుంబసభ్యులు పోరాడుతారని రమేష్‌ పేర్కొన్నారు. మూడు బెడ్‌రూమ్‌లు ఉన్న ఇంట్లో... ఉదయం 8 నుంచి రాత్రి 12 గంటల వరకు సోదాలు చేయడానికి ఏముంటుందని రమేష్ ప్రశ్నించారు

itwist 14102018

‘పదేళ్ల క్రితం మూసిన కార్యాలయానికి వెళ్లి తనిఖీలు చేశారు. ఏ సమాచారంతో తనిఖీలు చేశారో లీగల్‌గా వెళ్లి ప్రశ్నిస్తాం. మా ఇంట్లో కీలక పత్రాలు దొరికాయని కొన్ని ఛానళ్లు ప్రసారం చేశాయి. ఎలాంటి కీలక పత్రాలు దొరికాయో ఆ ఛానళ్లే చెప్పాలి. నేనేమైనా పాకిస్థాన్‌తో సంబంధం పెట్టుకున్నానా?. నావద్ద ఏదైనా రక్షణ ఆయుధాలకు సంబంధించిన సమాచారం ఉందా?. బ్యాంకు ఖాతాల పత్రాలు మాత్రమే దొరికితే కీలక పత్రాలు అంటు ప్రచారం చేశారు. మా బంధువుల ఇంట్లో మాత్రమే రూ.3.50 లక్షల నగదు ఐటీ అధికారులకు దొరికింది. నేను, మా బంధువులు క్రమం తప్పకుండా ఐటీ రిటర్నులు దాఖలు చేస్తున్నాం. ఐటీ దాడులకు భయపడి కేంద్రాన్ని ప్రశ్నించడం మానుకునేది లేదు.’ అని సీఎం రమేశ్‌ స్పష్టం చేశారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read