అమరావతి నిర్మాణం కోసం, చంద్రబాబు ఒక అడుగు వేస్తుంటే, "జే" బ్యాచ్ వంద అడుగులు వెనక్కు వేస్తుంది... ఇప్పుడు ఈ "జే" బ్యాచ్ కు తోడు, ఇంకో పిచ్చ బ్యాచ్ కూడా తయారయ్యింది... అమరావతి పై విషం చిమ్మే జాబితాలో తాజగా పవన్ కళ్యాణ్ చేరిన విషయం కూడా గమనిస్తున్నాం... పదే పదే, ఇది కొంత మందికి మాత్రమే రాజధాని అంటూ, ప్రజల్లో లేని పోనీ అపోహాలు సృస్తున్నారు... అక్కడ ఉన్న 29 గ్రామాల ప్రజలకే, తిరిగి భూమిని ఇస్తారు, 29 గ్రామాల్లో ఒక వర్గమే ఉంటుంది అని పవన్ ఎందుకు అనుకుంటున్నారో, దాని వెనుక ఉన్న అజెండా ఏంటో ఆయనకే తెలియాలి... ఈయనకి తోడు, ఇంకా కొంత మంది తయారయ్యారు... దరిద్రం ఏంటి అంటే, ఈ బ్యాచ్ అంతా వచ్చి విజయవాడలోనే రెచ్చిపోతుంది...
ఐవైఆర్ కృష్ణారావు అనే మహానుభావుడు, "ఎవరి రాజధాని అమరావతి ?" అనే పుస్తకం రాసాడు అంట... టైటిల్ చస్తుంటే, పవన్ మాట్లాడిన మాటలే గుర్తుకు వస్తున్నాయి కదా ? ఈ బ్యాచ్ అంతా కలిసి చేస్తున్న కుట్రలు కూడా, అలాగే ఉంటుంది మరి... ఈ పుస్తకం ఆవిష్కరించటానికి ఏప్రిల్ 5న, పవన్ కళ్యాణ్ విజయవాడ వస్తున్నారు... హైదరాబాద్ నుంచి వచ్చి, ఇక్కడకు వచ్చి అమరావతి మీద విషం చిమ్మి, మళ్ళీ హైదరాబాద్ వెళ్ళిపోయి, మళ్ళీ ఒక నెల తరువాత వస్తారనమాట.. పవన్ కళ్యాణ్ ఒక్కరే ఆనుకునేరు... ఇంకా ఈ పుస్తకం ఆవిష్కరణకు, ఎవరు వస్తున్నారో తెలుసా ?
బీజేపీ నేత, మాజీ మంత్రి మాణిక్యాల రావు... ఉండవల్లి అరుణ్ కుమార్... సిపియం నేత మధు... సిపిఐ నేత రామకృష్ణ... చివరకు, ఈ పుస్తకం వడ్డే శోభనాద్రీస్వర రావుకు, అంకితం చేస్తారు అంట... ఇదండీ వరుస... ఈ బ్యాచ్ లో, ఎవరు ఉన్నారో చూసారుగా... ఐవైఆర్ కృష్ణారావు, ఇప్పటికే అమరావతి స్విస్ ఛాలెంజ్ విధానం అపెయ్యమని, సుప్రీం కోర్ట్ కి కూడా వెళ్లారు... ఈయనకు తోడు పవన్, ఉండవల్లి లాంటి నేతలు వచ్చి, అమరావతి పై ఎలాంటి విషం చిమ్ముతారో... ఇప్పటికే జగన్ బ్యాచ్ అమరావతిని ఎలా ఆపుతుందో చూస్తున్నాం... ఇప్పుడు ఈయనకు కొత్త స్నేహితుడు తోడయ్యాడు... అంతా ఆపరేషన్ గరుడ మాయ... ప్రజలు ఎవరు ఏంటో, తెలుసుకుంటే అదే చాలు...