మాజీ చీఫ్ సెక్రటరీ ఐవైఆర్ కృష్ణా రావుకు చంద్రబాబు ఇచ్చిన ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. నవ్యాంధ్ర మొదటి చీఫ్ సెక్రటరీగా చేసారు, రిటైర్డ్ అయిన తరువాత బ్రాహ్మణ కార్పొరేషన్ అప్పచెప్పారు. అయినా, ఈయన తిన్నింటి వాసాలు లెక్కపెడుతున్నాడని గ్రహించించ లేక పోయారు. ఒకానొక రోజు,ఐవైఆర్ కృష్ణా రావు పాపం పండి, చంద్రబాబు ఇచ్చిన పదివి అనుభవిస్తూ, చంద్రబాబు పైనే విషం కక్కుతూ, దొరికిపోయాడు. నిజం తెలుసుకున్న చంద్రబాబు, వెంటనే దూరం పెట్టారు. అప్పటికి కాని, అర్ధం కాలేదు, ఈయన బీజేపీ పంపించిన పావు అని. అయితే, ఈయన మాత్రం తెలివిగా, ఒక పెద్ద ఐఏఎస్ లాగా, మేధావి లాగా ఫోజ్ కొడుతూ, హైదరాబాద్ లో కూర్చుని ఆంధ్రప్రదేశ్ పై విషం చిమ్ముతున్నాడు.

iyr 08072018 2

అమిత్ షా ఇచ్చిన స్క్రిప్ట్ ప్రకారం, ముందుగా అమరావతి పై ఏడుపులు మొదలు పెట్టాడు. అమరావతి పై విషం చిమ్ముతూ పుస్తకం రాసి, పవన్ కళ్యాణ్ చేత దాన్ని విడుదల చేసారు. ఎందుకంటే, పవన్ కళ్యాణ్ కూడా వీళ్ళ బ్యాచే కదా. తరువాత అమరావతి పై హై కోర్ట్ లో కేసులు వెయ్యటం మొదలు పెట్టాడు. ప్రతి పనికి అడ్డుపడుతున్నాడు. ఇక తాజాగా, తిరుమల వివాదంలో ప్రధాన పాత్ర ఈయనమే. అమిత్ షా డైరెక్షన్ లో, సాక్షాత్తు వెంకన్న పైనే రచ్చ రచ్చ చేస్తున్నాడు. రమణ దీక్షితులతో కలిసి, డ్రామా రక్తి కట్టిస్తున్నాడు. మరో పక్క ముద్రగడని కలవటం, జగన్ తో కలిసి పని చెయ్యటం, ఇలా మొత్తం గరుడ బ్యాచ్ అంతా ఒకటిగా పని చేస్తుంది. అయితే, ఇప్పటి వరకు, ఎక్కడా ఓపెన్ అప్ అవ్వకుండా, జాగ్రత్త పడుతూ వచ్చాడు ఐవైఆర్.

iyr 08072018 3

ఈ రోజు మాత్రం ముసుగు తీసేసాడు. ఒక పక్క 5 కోట్ల మంది ఆంధ్రులు, కేంద్రం అన్యాయం చేస్తుందని, మోడీ మోసం చేస్తున్నాడని, కేంద్రం పై పోరాటాలు చేస్తుంటే, అదేమీ లేదు కేంద్రం అన్నీ ఇచ్చేసింది అనే వాదన మొదలు పెట్టాడు. ఈ రోజు బీజేపీ ముసుగులో, ఒక మేధావుల ఫోరం పేరుతో, గుంటూరులో ఒక సదస్సు ఏర్పాటు చేసింది. "పరనిందే పరమావదిగా ప్రవర్తిస్తున్న పచ్చ చొక్కాల నిజస్వరూపాన్ని బట్టబయలు చేస్తాం, గుంటూరు రండి" అంటూ బీజేపీ ఈ రోజు ప్రచారం చేసింది. దీనికి ఐవైఆర్ ప్రధాన గెస్ట్ గా వెళ్ళాడు. కేంద్రం అన్నీ ఇచ్చేసింది అని, కేవలం రాష్ట్ర ప్రభుత్వం, రాజకీయం కోసం డ్రామాలు ఆడుతుందని, నేను రిటైర్డ్ ఐఏఎస్ గా చెప్తున్నాను అంటూ, ప్రజలను నమ్మించే ప్రయత్నం చేసాడు. మొత్తానికి, ఈ రోజు ముసుగు తొలగించి, బీజేపీ పార్టీ ప్రోగ్రాంలో, అదీ ఆంధ్రుల వ్యతిరేక కార్యక్రమంలో పాల్గున్నాడు ఐవైఆర్...

Advertisements

Advertisements

Latest Articles

Most Read