మాజీ చీఫ్ సెక్రటరీ ఐవైఆర్ కృష్ణా రావుకు చంద్రబాబు ఇచ్చిన ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. నవ్యాంధ్ర మొదటి చీఫ్ సెక్రటరీగా ఆయనకు అవకాసం ఇచ్చారు. రిటైర్డ్ అయిన తరువాత బ్రాహ్మణ కార్పొరేషన్ అప్పచెప్పారు. అయినా, ఈయన తిన్నింటి వాసాలు లెక్కపెడుతున్నాడని గ్రహించించ లేక పోయారు. ఒకానొక రోజు,ఐవైఆర్ కృష్ణా రావు పాపం పండి, చంద్రబాబు ఇచ్చిన పదివి అనుభవిస్తూ, చంద్రబాబు పైనే విషం కక్కుతూ, దొరికిపోయాడు. నిజం తెలుసుకున్న చంద్రబాబు, వెంటనే దూరం పెట్టారు. అప్పటికి కాని, అర్ధం కాలేదు, ఈయన బీజేపీ పంపించిన పావు అని. అయితే, ఈయన మాత్రం తెలివిగా, ఒక పెద్ద ఐఏఎస్ లాగా, మేధావి లాగా ఫోజ్ కొడుతూ, హైదరాబాద్ లో కూర్చుని ఆంధ్రప్రదేశ్ పై విషం చిమ్ముతున్నాడు.
అమిత్ షా ఇచ్చిన స్క్రిప్ట్ ప్రకారం, ముందుగా అమరావతి పై ఏడుపులు మొదలు పెట్టాడు. అమరావతి పై విషం చిమ్ముతూ పుస్తకం రాసి, పవన్ కళ్యాణ్ చేత దాన్ని విడుదల చేసారు. ఎందుకంటే, పవన్ కళ్యాణ్ కూడా వీళ్ళ బ్యాచే కదా. తరువాత అమరావతి పై హై కోర్ట్ లో కేసులు వెయ్యటం మొదలు పెట్టాడు. ప్రతి పనికి అడ్డుపడుతున్నాడు. ఇక తాజాగా, తిరుమల వివాదంలో ప్రధాన పాత్ర ఈయనమే. అమిత్ షా డైరెక్షన్ లో, సాక్షాత్తు వెంకన్న పైనే రచ్చ రచ్చ చేసాడు. రమణ దీక్షితులతో కలిసి, డ్రామా రక్తి కట్టించారు. మరో పక్క ముద్రగడని కలవటం, జగన్ తో కలిసి పని చెయ్యటం, ఇలా మొత్తం గరుడ బ్యాచ్ అంతా ఒకటిగా పని చేస్తుంది. ఇప్పటి వరకు, ఎక్కడా ఓపెన్ అప్ అవ్వకుండా, జాగ్రత్త పడుతూ వచ్చాడు ఐవైఆర్.
అయితే, ఇక ఈ నాటకాలకు తెర పడింది.. ఆపరేషన్ గరుడ క్లైమాక్స్ కు వచ్చిన సందర్భంలో, ఐవైఆర్ పాత్ర సంపూర్ణం అయ్యింది. నిన్న హైదరాబాద్ వచ్చిన సందర్భంలో ఐవైఆర్ కృష్ణా రావు, అమిత్ షా ను కలిసి, బీజేపీలో చేరిపోయారు. ఐవైఆర్ గారి అసలు బండారం ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి... మొన్న జగన్ తో నేడు అమిత్ షా తో... చంద్రబాబు గారు ఈయన్ని నమ్మి బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ గా నియమిస్తే ఈయన గారు ప్రత్యర్థులతో చేతులు కలిపి ఆంధ్ర రాష్ట్రానికే అన్యాయం చేయటానికి కుట్రలు చేసాడు... ఈయనగారు వ్యవహారం తొందరగా కనిపెట్టాం కాబట్టి సరిపోయింది... లేకపోతె ఇంకెన్ని అనర్థాలకు తెరలేపేవాడో...