గత చంద్రబాబు ప్రభుత్వంలో, నవ్యాంధ్ర మొదటి చీఫ్ సెక్రటరీగా పని చేసిన వ్యక్తి ఐవైఆర్ కృష్ణారావు. అమరావతి లాంటి ప్రాజెక్ట్ లో కూడా, ఆయనే దగ్గరుండి అన్నీ చూసుకున్నారు. రిటైర్డ్ అయిన తరువాత, ఆయనకు బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మెన్ పదవి కూడా చంద్రబాబు గారు ఇచ్చారు. అక్కడ వరకు బాగానే ఉంది. చంద్రబాబు గారు ఇంత గౌరవం ఇచ్చారు. చీఫ్ సెక్రటరీ ఇచ్చారు, రిటైర్డ్ అయిన తరువాత కార్పొరేషన్ చైర్మెన్ ని చేసి, భారీ జీతం కూడా ఇచ్చారు. అలాంటి చంద్రబాబు గారి పై, కార్పొరేషన్ చైర్మెన్ గా ఉంటూనే, లేకిగా ఉండే పేటీయం ఎడిట్స్ పోస్ట్ చేస్తూ, చివరకు అవన్నీ బయట పడి పదవి పోగుతున్నారు. ఆయన ఇచ్చిన గౌరవాన్నికాపాడుకోకుండా, ఎవరో ప్రయోజనాల కోసం తాకట్టు పెట్టారు. తరువాత జగన్ మోహన్ రెడ్డికి డైరెక్ట్ సపోర్ట్ ఇవ్వక పోయినా, ఆయన చెయ్యల్సింది ఆయన చేస్తూ, చంద్రబాబుని దించి, జగన్ ని ఎక్కించటంలో, ఆయనకు ఇచ్చిన పాత్ర ఆయన అద్భుతంగా పోషించారు. తరువాత బీజేపీలో చేరినా, అక్కడ వారు ఎవరి గెలుపు కోసం పని చేసారో అందరికీ తెలిసిందే. తమకు కావలసిన విధంగా జగన్ మోహన్ రెడ్డిని ఎక్కించారు. ఇప్పుడు రెండున్నరేళ్ళు అయ్యింది. అప్పుడప్పుడూ జగన్ పరిపాలన పై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
ముఖ్యంగా మాజీ ఐఏఎస్ కావటంతో, పెన్షన్ టైంకి రావటం లేదు అంటూ, పోస్ట్ లు పెడుతూ ఉంటారు. అలాంటి ఐవైఆర్ కృష్ణారావు ఈ రోజు జగన్ పై విరుచుకు పడ్డారు. ఆయనకు ఇన్నాళ్లకు జ్ఞానోదయం అయ్యిందో ఏమో కానీ, సమర్ధ నాయకత్వం ఉండాలి అంటూ, చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయంసం అయ్యింది. ఆయన ఈ రోజు మాట్లాడుతూ, రాష్ట్రంలో ఆర్ధిక పరిస్థితి చుస్తే చాలా బాధగా ఉంది అంటూ, ఆయన ఆవేదన వ్యక్తం చేసారు. ఉద్యోగులను కూడా ఇబ్బందులు పెడుతూ, వారి జీతాలు, పెన్షన్లు కూడా ఆలస్యం చేస్తున్నారని అన్నారు. చివరికి ఆసుపత్రులలో పరికరాలు కూడా సమకూర లేని పరిస్థితి ఉందని అన్నారు. ఎప్పుడూ లేని విధంగా భూములు కూడా తాకట్టు పెట్టే పరిస్థితి వచ్చాం అని అన్నారు. ఈ పరిస్థితి చూస్తుంటే, రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో అర్ధం అవుతుందని అన్నారు. ఇప్పటికి 5 లక్షల కోట్ల అప్పు చేసారని, ఈ అప్పు రాష్ట్రం నెత్తి మీద పెడితే, ఎవరు తీరుస్తారని ప్రశ్నించారు. సామర్ధ్యం ఉన్న నాయకుడు లేకపోవటం దురదృష్టకరం అని అన్నారు.