దారి తెన్నూ... దిక్కుమొక్కు ... దిశ దశ లేని అవమాన పడ్డ రాష్ట్రం... ఇలాంటి సందర్భంలో మేమున్నామంటూ, అమరావతి రైతులు 33 వేల ఎకరాలు భూమిని రాష్ట్రం కోసం ఇచ్చిన రైతులను అవమానించటానికి మీకు మనసెలా వచ్చింది....? ఎవరో కొద్ది మంది స్వార్దంతో....రాజకీయప్రేరేపణ తో ...అభివృద్ధి చెందిన తర్వాత అమ్ముకోవచ్చన్న ఆలోచనతో భూములు ఇవ్వటానికి విముఖత చూపించి ఉండవచ్చు... ఆక్రమణదారులు వారి బండారం బయటపడుతుందన్న ఆలోచనతో ఇవ్వటానికి ఇష్టం లేకపోవచ్చు...
అనేక గ్రామాలు...అనేక కులాలు...మతాలు...వర్గాలు..అందరూ కలసే భూములిచ్చారు...ఇన్నాళ్ళు కలిసి బతికారు...ఇప్పుడూ కలిసే బతుకుతారు... ఏ ఒక కులమో...వర్గమో ప్రయోజనం పొందరు...

amaravati 05042018 1

ఐవైయ్యార్... ఉండవల్లి లాంటి వారు పక్షపాతంతో, జగన్ కి మద్దతుగా వ్యవహరిస్తారు... ఇది అందరికి తెలిసిందే ... తగుదునమ్మా అంటూ ఐవైయ్యార్ కి సపోర్ట్ చేస్తూ, పవన్ కూడా విషం కక్కుతుంటే, ఏమనుకోవాలి ? భూములిచ్చిన రైతులు కంటే వీరు తెలివైన వారు అనుకుంటున్నారా...? ఈ రోజు వీరందరూ మాట్లాడిన మాటలు ఏమిటి ? ప్రతి ఒక్కరు దొనకొండ రాజధాని ఎందుకు చెయ్యలేదు అని అడుగుతున్నారు ? అసలు దొనకొండ రాజధాని చెయ్యమని శివరామ కృష్ణన్ కమిటి ఎక్కడ చెప్పింది ? అప్పటి కాంగ్రెస్ తో బెయిల్ డీల్ లో, జగన్ బ్యాచ్ పన్నిన పన్నాగం ఈ దొనకొండ... అంటే, ఈ రోజు మాట్లాడే బ్యాచ్ అంతా, జగన్ కోసం దొనకొండ అంటున్నారా ? మొన్న జగన్ కూడా పాదయాత్రలో ఇదే విషయం చెప్పాడు... నేను సియం అయితే, దొనకొండ రాజధాని చేస్తాను అని... అంటే, వీరందరూ కలిసి పన్నుతున్న కుట్రా ఇది ?

amaravati 05042018 1

పవన్ కళ్యాణ్ ఈ మధ్య పదే పదే మాట్లాడుతూ, అమరావతి తెలుగుదేశం పార్టీ రాజధాని అంటూ, ఒకే కులం రాజధాని అంటూ, ఎలాంటి సంకేతాలు ప్రజలకు ఇస్తున్నారు ? అమరావతి 29 గ్రామాల్లో, ఎన్ని కులాలు ఉన్నాయి, ఎంత మంది ఎన్ని ఏళ్ళ నుంచి అక్కడ కలిసి ఉంటున్నారు అనే విషయం, ఈ అజ్ఞానికి తెలుసా ? ఎవరినికి సంతోష పెట్టటానికి ఈ మాటలు ? ఒకే కులం, ఏ ఊరిలో అన్నా ఉంటుందా ? ఈ మైదనాలకి తెలియని విషయం ఏంటి అంటే, ఇక్కడ 33 వేల ఎకరాలు తీసుకుని డెవలప్ చేసి, మళ్ళీ రైతులకే అక్కడ భూమి ఇస్తున్నారు.... ఇక్కడ బాగుపడేది అక్కడి రైతులే... అంతే కాని తెలుగుదేశం పార్టీ వారు కాదు... ఈ రోజు వీరు మాట్లాడిన మాటలు చూస్తుంటే, ఈ 33 వేల ఏకరాలు ఇచ్చిన రైతుల నోట్లో మట్టి కొట్టి, అమరావతిని రాజధానిగా మార్చమని చెప్తున్నారు... ట్విస్ట్ ఏంటి అంటే, ఈ బ్యాచ్ అంతా హైదరాబాద్ నుంచి వచ్చి, మన రాజధాని మీద కబుర్లు చెప్తున్నారు... రేపు ఫ్లైట్ కి, మళ్ళీ హైదరాబాద్ చేక్కిస్తారు... అయినా కలిసి ఉండాలి అని చెప్పాలి కాని, ఎప్పుడూ విడిపోతారు, గొడవలు అవుతాయి అని చెప్తావు ఏంటి పవన్ ? ఇది మన ఖర్మ....

Advertisements

Advertisements

Latest Articles

Most Read