ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ, ఎల్వీ సుబ్రహ్మణ్యం ఆకస్మిక బదిలీ, సంచలనం రేపుతుంది. అకస్మాత్తుగా అయన బదిలీ అయ్యారు అంటే, ఏమి జరిగి ఉంటుందా అనే చర్చ మొదలైంది. ప్రవీణ్ ప్రకాష్ తో గొడవ అనేది, ఆయన్ను సాగనంపటానికి చేసిన వ్యవహారమా అనే చర్చ జరుగుతుంది. ప్రవీణ్ ప్రకాష్ తో గొడవ అనేది బదిలీకి కారణం కాదని, దీని వెనుక, ఏదో బలమైన కారణాలు ఉన్నాయని, పలువురు అభిప్రాయ పడుతున్నారు. చీఫ్ సెక్రటరీకి తెలియకుండా బిజినెస్ రూల్స్ మార్చారం, చీఫ్ సెక్రటరీ కూడా షోకాజ్ నోటీసు ఇచ్చే అధికారాన్ని ప్రవీణ్ ప్రకాష్ తీసుకోవటం, క్యాబినెట్ సమావేశంలో చీఫ్ సెక్రటరీకి తెలియకుండా అజెండా చేర్చటం, ఇవన్నీ ఎల్వీని బయటకు పంపే చర్యలే అని, అసలు కారణం ఇంకా ఏదో ఉండనే గుసగుసలు వినిపిస్తున్నాయి. అన్నా అన్నా అని, ఎల్వీని , జగన్ సంబోధించే అంత రిలేషన్ ఉందని, మరి ఇప్పుడు, ఎందుకు తేడా వచ్చిందో అని పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

iyr 04112019 1

అయితే దీని పై మాజీ చీఫ్ సెక్రటరీ ఐవైఆర్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. తిరుమల తిరుపతి దేవస్థానం లో అన్య మతస్థులు ఉండటానికి వీలు లేదని పట్టు బట్టడం వల్లే నిజాయితీపరుడు సద్బ్రాహ్మణుడు అయిన యల్ వి సుబ్రహ్మణ్యం గారిని ట్రాన్స్ఫర్ చేసి ఉంటారు అనిపిస్తుంది అంటూ ఆయన ట్వీట్ చేసారు. ఇది ఆయన చేసిన ట్వీట్..."సీఎస్ ను తొలగించే అధికారం సీయమ్ గారికి ఉన్న ఈ తొలగించిన విధానం సరిగా లేదు. బాధ్యత లేని అధికారం చలాయించే ముఖ్యమంత్రి కార్యాలయం ముఖ్యమంత్రుల మెడలకు ఉచ్చులా చుట్టుకుంటూ ఉన్నది. హిందూ దేవాలయాల్లో అన్య మతస్తులను తొలగించే విషయంలో గట్టిగా నిలబడి నందుకు ఇది బహుమానం అయితే ఇంకా మరీ దారుణం."

iyr 04112019 1

అలాగే పవన్ కళ్యాణ్ కూడా ఈ విషయం పై మాట్లాడుతూ, జగన్ కోరి తెచ్చుకున్న సీఎస్‌ ఎల్వీ సుబమణ్యంను ఉన్నట్టు ఉండి తప్పించారంటే, ఏవో తప్పులు జరిగినట్లే అర్థమవుతోంది అంటూ పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేసారు. దీని పై విజయవాడ ఎంపీ కేశినేని నాని కూడా ట్విట్టర్ లో వ్యంగ్యంగా స్పందించారు. "ఏపీ సీఎస్ ఓ అంశంలో ప్రిన్సిపల్ సెక్రటరీకి షోకాజ్ నోటీసులు జారీచేశారు. ఆ తర్వాత ప్రిన్సిపల్ సెక్రటరీ ఏకంగా సీఎస్ నే బదిలీ చేశారు. కంగ్రాచ్యులేషన్స్!" అంటూ ట్వీట్ చేశారు. ఇక మరో టిడిపి నేత వార్ల రామయ్య మాట్లాడుతూ, "సీఎం గారూ మీ పరిపాలన అగమ్యగోచరంగా ఉంది. ఓ విషయంలో తన కిందిస్థాయి అధికారికి సీఎస్ షోకాజ్ నోటీసులు ఇస్తే ఆ కింది స్థాయి అధికారిని మీరు రక్షిస్తూ సీఎస్ నే బదిలీ చేశారు. పాలనా యంత్రాంగానికి మీరు ఇస్తున్న సందేశం ఏమిటి? గతంలో ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ లేదు. ఏమి అవగాహన!" అంటూ ట్వీట్ చేసారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read