కలియుగ వైకుంఠం, తిరుమల శ్రీవారి సాక్షిగా ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా హామీ ఇచ్చి మాట తప్పారు. ఇప్పుడు శ్రీవారి ఆలయన్నే తమ ఆధీనంలోకి తీసుకుందామని అనుకుంటున్నారు. దీనికి బీజం వేసింది, మన స్వామి వారి మనకు కాకుండా చేసే ప్రయత్నం చేసింది, అప్పటి టిటిడి ఈఓ, ఐవైఆర్ కృష్ణా రావు... అవును, ఇప్పుడు రాష్ట్రం పై అనేక కుట్రలు, అమరావతి పై విషం చిమ్ముతున్న, ఆంధ్రప్రదేశ్ మాజీ చీఫ్ సెక్రటరీ ఐవైఆర్ కృష్ణా రావు... పవన్, జగన్, నెత్తిన పెట్టుకున్న ఐవైఆర్ కృష్ణా రావు... ఇదే ఐవైఆర్ కృష్ణా రావు, 2011లో, కేంద్ర పురావస్తుశాఖ వారికి ఉత్తరాలు రాసి, తిరుపతిని తీసుకోవాలని ప్రతిపాదించారు.. రాష్ట్రానికి తిరుమల అవసరం లేదని, కేంద్రం ఆధీనంలో ఉంచుకోవాలని, ప్రతిపాదించారు.. అయితే, అప్పటిలో టిటిడి బోర్డ్ ఆ ప్రతిపాదన ఉపసంహరించుకున్నది.
ఇప్పుడు ఈ మతోన్మాదులు సొంత, మతం వారిని కూడా వదలకుండా ఇలాంటి పనులకు శ్రీకారం చుడుతున్నారు. ఐవైఆర్ లాంటి వారి అప్పటి మాటలు నమ్మి, కేంద్రం తిరుమలను తమ ఆధీనంలోకి తీసుకొంటానికి పన్నాగం పన్నింది.. ఆలయాలన్నింటినీ రక్షిత కట్టడాల పరిధిలో చేర్చేందుకు కేంద్రం సన్నాహాలు చేస్తోంది. పురావస్తుశాఖ పరిధిలోకి తీసుకువచ్చేందుకు ఏర్పాటు చేస్తోంది. ఆయా దేవాలయాలను సందర్శించి ఫొటోలు తీసుకునేందుకు.. కేంద్ర పురావస్తు శాఖ అధికారులకు సహకరించాలని రాష్ట్రానికి కేంద్రం లేఖ పంపింది... తిరుమలను కేంద్ర పరిధిలోకి తీసుకోవటానికి ఇది మొదటి అడుగు.
త్వరలో పురావస్తు శాఖ అధికారులు తిరుమలను సందర్శించనున్నారు. టీటీడీ నుంచి జాబితా అందిన తర్వాత కేంద్ర అధికారులు సందర్శించే అవకాశం ఉంది. ఈ తర్వాత కేంద్రం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. తిరుమలలోని ఆలయాలను కేంద్ర పురావస్తు శాఖ స్వాధీనం చేసుకుంటే ఏపీ ప్రభుత్వానికి ఎలాంటి అధికారం ఉండదు. ఆలయాలకు వచ్చే ఆదాయాన్ని కేంద్రం తీసుకునే అవకాశం ఉంది. టీటీడీ బోర్డు మెంబర్లను నామినేట్ చేసే అధికారం కూడా రాష్ట్రానికి లేకుండా పోతుంది. అంటే టీటీడీ మొత్తం కేంద్ర చేతుల్లోకి పోతుంది. ఇది ఐవైఆర్ అప్పుడు నాటిన బీజం, ఇప్పుడు కేంద్రానికి ఆయుధం అయ్యింది... ఇలాంటి ఐవైఆర్ ను నెత్తిన పెట్టుకుంటున్న పవన్, జగన్, ఒకసారి ఆలోచించాలి... ఇది అప్పట్లో టైమ్స్ అఫ్ ఇండియా లో కూడా వచ్చిన కధనం https://timesofindia.indiatimes.com/india/Involving-ASI-for-shrines-upkeep-only-TTD/articleshow/7429330.cms