నిన్నటి నుంచి సోషల్ మీడియాలో వైసిపీ తప్పుడు ప్రచారం చేస్తుంది. పిచ్చ బ్రాండుల పేరుతో వైసీపీ చేస్తున్న అరాచాకాన్ని ప్రశ్నిస్తూ టిడిపి ఆందోళన చేయటంతో, అది ప్రజల్లోకి బలంగా వెళ్ళింది. దీంతో వైసీపీ సోషల్ మీడియాలో, ఇతర చోట్ల కౌంటర్ చేస్తూ, పిచ్చ బ్రాండులు అన్నీ చంద్రబాబు హాయాంలోనే వచ్చాయి అంటూ తప్పుడు ప్రచారం చేసే ప్రయత్నం చేసారు. తమ అనుకూల బ్లూ మీడియాలో తప్పుడు ప్రచారం చేసారు. అయితే దీనికి సంబంధించి, వెంటనే తెలుగుదేశం పార్టీ కౌంటర్ ఇచ్చింది. జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలోనే ఇచ్చిన ఒక ఆర్టిఐ సమాధానంతో, వైసీపీ ప్రచారాన్ని తిప్పి కొట్టింది. జగన్ మోహన్ రెడ్డి వచ్చిన తరువాత, కేవలం వైసీపీ హాయాంలోనే, వందకుపైగా పిచ్చి బ్రాండులు మద్యం, రిజిస్టర్ అయినట్టు, ఆ సమాధానంలో ఉంది. కేవలం నాలుగు నెలల్లో, పిచ్చి పిచ్చ బ్రాండుల పేరుతో అవి వైసీపీ ప్రభుత్వంలోనే రిజిస్టర్ అయ్యాయి. ఒక పక్క మద్య నిషేధం అని చెప్తున్న వైసీపీ ప్రభుత్వం, ఇలా విచ్చలవిడిగా బ్రాండులు తేవటమే కాకుండా, ఎదురు అవన్నీ చంద్రబాబు తెచ్చిన బ్రాండులు అంటూ, తప్పించుకునే ప్రయత్నం చేయటం అందరినీ షాక్ కు గురి చేసింది. అధికారంలో ఉండి కూడా, ఇలాంటి తప్పుడు ప్రచారం చేయటం పై, సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. https://twitter.com/JaiTDP/status/1505565706657869826
ఇక దీని పై టిడిపి తీవ్రంగా స్పందించింది. టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి జీ.వీ.రెడ్డి వైసీపీ మద్యం పైన చేస్తున్న ప్రచారం పై కౌంటర్ ఇచ్చారు. "ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బుద్ది ఉన్నవాడెవడైనా మద్యపాన నిషేధం చేస్తాడని చెప్పిన జగన్ రెడ్డి, ఇప్పుడు ఎందుకు బుద్ధిలేని పనులు చేస్తున్నాడు? నాసిరకం మద్యాన్ని కల్తీసారాని అధిక ధరకు విక్రయిస్తూ ఎందుకు ప్రజల ప్రాణాలు తీస్తున్నాడు? ఆడవారి తాళిబొట్లు తెగుతున్నాయని గతంలో గగ్గోలుపెట్టిన జగన్ రెడ్డి, ఇప్పుడు అవేతాళి బొట్లు తెంపుతూ, తన ఖజానా ఎందుకు నింపుకుంటున్నాడో ఆయనే సమాధానం చెప్పాలి. యథేచ్ఛగా రాష్ట్రంలో నాసిరకం మద్యం అమ్ముతున్న ముఖ్యమంత్రి అట్టహాసంగా ప్రచారం చేసుకొని మరీ మద్యపాన విమోచన కమిటీని ఎందుకు తీసుకొచ్చాడు? తమ ప్రభుత్వం విక్రయిస్తున్న మద్యాన్ని తాగవద్దని దానివల్ల ప్రాణాలు పోతాయని ప్రజలకు చెప్పలేని కమిటీతో ఎవరికి ఎలాంటి ప్రయోజనం కలుగుతుందో ముఖ్యమంత్రి సమాధానంచెప్పాలి? రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న మద్యం అమ్మకాలు, మద్యం తయారీ వివరాలపై శ్వేతపత్రం విడుదల చేయగల దమ్ము ముఖ్యమంత్రికి ఉంటే తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం." అని అన్నారు.