జీఎస్టీ. గూడ్స్ అండ్ సర్వీస్ టాక్స్. దేశమంతా వస్తుసేవల పన్నురూపంలో ఒకే దేశం-ఒకే పన్ను విధానం అమలు అవుతోంది. ఒక్క ఏపీలో జీఎస్టీతోపాటు జేఎస్టీ కూడా చెల్లించాలట. జేఎస్టీ అంటే జగన్ సెల్ఫ్ ట్యాక్స్. ఇదీ ఏపీలో జగన్ రెడ్డి వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన నుంచీ బలవంతంగా వసూలు చేస్తున్న ట్యాక్స్. దీనిపై తెలుగుదేశం జె ట్యాక్స్ పేరు పెట్టింది. జగన్ రెడ్డికి ఒకప్పుడు అత్యంత సన్నిహితుడు అయిన జమ్మలమడుగు ఆదినారాయణ రెడ్డి ఓపెన్ హార్ట్ విత్ ఆర్కేలో ఈ జగన్ సెల్ఫ్ ట్యాక్స్ గురించి వివరించాడు. టిడిపి ప్రభుత్వం ఉన్నప్పుడు వచ్చిన పరిశ్రమలనూ జెఎస్టీ కోసం వేధించారని, అవి కట్టలేక చాలా పరిశ్రమలు విస్తరణ నిలిపేశారని చెప్పుకొచ్చారు. వైసీపీకి మద్దతు పలికి గత ఎన్నికల్లో వారి కోసం పనిచేసిన మైసూరారెడ్డికి చెందిన తేజా సిమెంట్స్ జగన్ సెల్ఫ్ ట్యాక్స్ కట్టలేక పరిశ్రమ ఏర్పాటు చేయలేదని ఆదినారాయణరెడ్డి చెప్పారు. కేంద్రం విధించే జీఎస్‌టీ కంటే ఏపీలో జేఎస్టీ చాలా పవర్‌ఫుల్ అని, ‘జగన్ సెల్ఫ్ ట్యాక్స్’ను పారిశ్రామికవేత్తలు తట్టుకోలేకపోతున్నారని ఆరోపించారు. జగన్‌కు ఆస్తులు ఎన్నిచోట్ల ఉన్నాయో ఆయనకే తెలియదని చెప్పుకొచ్చారు. కేరళలో అనంత పద్మనాభస్వామికి నేలమాళిగలు ఉన్నట్లే ఎన్ని నేలమాళిగలు ఉన్నాయో లెక్కేలేదని, ఆయన అనంత పద్మనాభస్వామి అయితే.. ఈయన అనంత జగన్నాథస్వామి అంటూ జగన్ అవినీతిని బయటపెట్టారు.
జే-టాక్స్ చాలా చిన్నది, జగన్ సెల్ఫ్ ట్యాక్స్ గురించి మీకు తెలియాలి అంటున్న బీజేపీ నేత..
Advertisements