సరిగ్గా 15 రోజుల క్రిందట కడప జిల్లా పాదయాత్రలో ఉన్న జగన్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి ఒక ఛాలెంజ్ చేశారు.... "చంద్రబాబు, నీకు 15 రోజులు టైం ఇస్తున్నా, నాకు విదేశాల్లో ఒక్క రూపాయి ఉన్నట్టు రుజువు చేస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా" అంటూ ఛాలెంజ్ విసిరారు జగన్... ఈ ఛాలెంజ్ , హరిశ్చంద్రుడు వారసుడు చేసినట్టు, లోటస్ పాండ్ భజన బృందాలు చెలరేగిపోయాయి... నిరూపించు బాబు, నిరూపించు, అంటూ హడావిడి చేశారు... కట్ చేస్తే, సరిగ్గా 15 రోజులు అయ్యాయి... ఈడీ (Enforcement Directorate) ఇచ్చిన జాబితాలో, నల్లధనంను తెల్లధనంగా మార్చుకోవటం కోసం నకిలీ కంపెనీలు సృష్టించిన వారి లిస్టు తీస్తే, దేశంలోనే టాప్ 10మందిలో, మన ప్రతిపక్ష నేతకు ప్లేస్ ఇచ్చింది Enforcement Directorate..
జగన్ మొత్తం 31 షెల్ కంపెనీలతో, రూ.368 కోట్లు మనీలాండరింగ్‌కి పాల్పడి, ఆ టాప్ 10 లిస్టులో పేరు సంపాదించుకున్నారు... ఈ టాప్ జాబితాలో కంపెనీలు ఉండగా, రాయకీయ నాయకుల్లో జగన్ ఉన్నారు... దక్షిణ భారత దేశంలో టాప్ 10 జాబితాలో జగన్ మాత్రమే ఉన్నారు... అలాగే, పెద్ద ఎత్తున విదేశాలకు తరలించిన వ్యక్తుల సమాచారాన్ని గతేడాది పనామా పేపర్లు, ఈ ఏడాది ప్యారడైజ్ పేపర్స్ బయటపెట్టిన విషయం తెలిసిందే. ఇటీవల బయటకు వచ్చిన ప్యారడైజ్ పేపర్లలో భారత్‌కు చెందిన 714 మంది పేర్లు కూడా ఉన్నాయి. అందులో వైసీపీ అధినేత జగన్ పేరు కూడా ఉంది.
తాజాగా లెక్కల్లో చూపని సంపాదనను అక్రమ మార్గాల ద్వారా చలామణిలోకి తీసుకొస్తూ, షెల్ కంపెనీలను నడుపుతోన్న వారి జాబితాను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ రూపొందించింది. హవాలా ద్వారా విదేశాలకు పెద్ద మొత్తంలో తరలించి తిరిగి పెట్టుబడుల రూపంలో వాటిని తెచ్చుకుంటున్న తొలి 12 సంస్థల జాబితాలో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి కూడా ఉన్నారని ఈడీ తెలిపింది. డొల్ల కంపెనీలు పెట్టి విదేశాలకు పెద్ద మొత్తంలో డబ్బు తరలించారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న టాప్ 10 లిస్టు లో జగన్ ఉన్నారు... మరి ఇంత స్పష్టంగా, ఈడీ, అంతర్జాతీయ నిఘా సంస్థలు జగన్ విదేశాల నుంచి మనీలాండరింగ్ చేశారు అని స్పష్టంగా చెప్తున్నాయి... మరి జగన్, ఛాలెంజ్ ఒప్పుకుంటారా ? చంద్రబాబు గారు మాట్లాడరు... చట్టం తనపని తాను చేసుకుపోతూంది... వాటి చర్యలు మాట్లాడుతాయి...