వైకాపా అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి కడప జిల్లా పులివెందులలో శుక్రవారం దాఖలు చేసిన ఎన్నికల అఫిడవిట్‌లో తనపై నమోదైన కేసులు, వాటి దర్యాప్తు ఏ స్థాయిలో ఉందో ప్రకటించారు. 11 సీబీఐ, 7 ఈడీ కేసులు, పోలీసుస్టేషన్లు, కింది కోర్టుల్లో 13 కేసులు ఉన్నాయని వివరించారు. వీటిలో అత్యధిక కేసులను కోర్టులు ఇంకా విచారణ కోసం పరిగణనలోకి తీసుకోలేదని ఆయన వెల్లడించారు. తనపై అవినీతి నిరోధక చట్టం, మనీలాండరింగ్ నిరోధక చట్టాల కింద కేసులున్నట్లు అఫిడవిట్‌లో తెలిపారు. అలాగే పరువునష్టం దావా, వర్గాలను రెచ్చగొట్టడం, జాతీయ గీతాన్ని అవమానించటం, explosive substance, preperation made for causing death, అనుచిత ప్రవర్తనలాంటి మరికొన్ని కేసులు ఉన్నాయని పేర్కొన్నారు.
సీబీఐ కేసులు.. సీబీఐ ఎఫ్‌ఐఆర్ నెం.ఆర్‌సీ.19(ఎ)/2011 కింద కింది కేసుల నమోదు 1. సీసీ 26/2014 -సీబీఐ కోర్టు, హైదరాబాద్ (ఇందూ- గృహనిర్మాణమండలి సంయుక్త భాగస్వామ్య ప్రాజెక్టు వ్యవహారం) * సెక్షన్లు: 120బి, 420, 409 ఐపీసీ, 11, 13(2) రెడ్‌విత్ 13(1)(సి)(డి) అవినీతి నిరోధక చట్టం * స్థాయి: అభియోగాలు నమోదు కాలేదు. 2. సీసీ 28/2013 సీబీఐ కోర్టు, హైదరాబాద్ (లేపాక్షి నాలెడ్జ్ హబ్ వ్యవహారం) * సెక్షన్లు: 120బి రెడ్‌విత్ 420, 468, 471, ఐపీసీ, సెక్షన్ 9- అవినీతి నిరోధక చట్టం * స్థాయి: అభియోగాలు నమోదు కాలేదు 3. సీసీ 27/2013 సీబీఐ కోర్టు, హైదరాబాద్ (ఇందూటెక్ జోన్ వ్యవహారం) * సెక్షన్లు: 120బి, 420, ఐపీసీ, సెక్షన్ 9 -అవినీతి నిరోధక చట్టం * స్థాయి: అభియోగాలు నమోదు కాలేదు. 4. సీసీ 26/2013 సీబీఐ కోర్టు, హైదరాబాద్ (పెన్నా సిమెంట్స్ వ్యవహారం) * సెక్షన్లు: 120బి రెడ్‌విత్ 420 ఐపీసీ, సెక్షన్ 9- అవినీతి నిరోధక చట్టం * స్థాయి: అభియోగాలు నమోదు కాలేదు. 5. సీసీ 25/2013 సీబీఐ కోర్టు, హైదరాబాద్ (రఘురాం/భారతి సిమెంట్స్ వ్యవహారం) * సెక్షన్లు: 120బి 420, 107 రెడ్‌విత్13(2) రెడ్‌విత్ 13(1)(డి) అవినీతి నిరోధక చట్టం * స్థాయి: అభియోగాలు నమోదు కాలేదు. 6. సీసీ 24/2013 సీబీఐ కోర్టు, హైదరాబాద్ (ఇండియా సిమెంట్స్) * సెక్షన్లు: 120బి రెడ్‌విత్ 420, 420 ఐపీసీ, సెక్షన్ 9, 12 -అవినీతి నిరోధక చట్టం * స్థాయి: అభియోగాలు నమోదు కాలేదు.
7. సీసీ 12/2013 సీబీఐ కోర్టు, హైదరాబాద్ (దాల్మియా సిమెంట్స్ వ్యవహారం) సెక్షన్లు: 120బి, 420, ఐపీసీ, సెక్షన్ 9- అవినీతి నిరోధక చట్టం * స్థాయి: అభియోగాలు నమోదు కాలేదు. 8. సీసీ 14/2012 సీబీఐ కోర్టు, హైదరాబాద్ (వాన్‌పిక్ ప్రాజెక్ట్ వ్యవహారం) * సెక్షన్లు: 120బి, 420, 409 ఐపీసీ, సెక్షన్ 12- అవినీతి నిరోధక చట్టం * స్థాయి: అభియోగాలు నమోదు కాలేదు. 9. సీసీ 10/2012 సీబీఐ కోర్టు, హైదరాబాద్ (రాంకీ ఫార్మా వ్యవహారం) * సెక్షన్లు: 120బి, 420, 471 ఐపీసీ, సెక్షన్ 9, 12 అవినీతి నిరోధక చట్టం * స్థాయి: అభియోగాలు నమోదు కాలేదు. 10. సీసీ 9/2012 సీబీఐ కోర్టు, హైదరాబాద్ (జగతి పెట్టుబడులు వ్యవహారం) * సెక్షన్లు: 120బి రెడ్‌విత్ 420, 420, 471 ఐపీసీ * స్థాయి: అభియోగాలు నమోదు కాలేదు. 11. సీసీ 8/2012 సీబీఐ కోర్టు, హైదరాబాద్ (హెటిరో, అరబిందో, ట్రైడెంట్ ఫార్మా కంపెనీల వ్యవహారం) * సెక్షన్లు: 120బి రెడ్‌విత్ 420 ఐపీసీ, సెక్షన్ 12 రెడ్‌విత్ 11 - అవినీతి నిరోధక చట్టం * స్థాయి: అభియోగాలు నమోదు కాలేదు.