ఈ మధ్య కాలంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న పనులు, దేశ వ్యాప్తంగా ట్రెండ్ అవుతున్నాయి. పోజిటివ్ స్టొరీలు కాదు, నెగటివ్ స్టొరీలతో పరువు పోతుంది. రాష్ట్రంలో జరుగుతున్న పనుల పై, జాతీయ మీడియా ప్రముఖంగా ప్రచురిస్తుంది. ఈ మధ్య కాలంలో జాతీయ స్థాయిలో ట్రెండ్ అయినవి, ఇసుక కష్టాలు/మరణాలు. జాతీయ జెండా ఉన్న చోట, అది తీసి వైసిపీ రంగులు పూయటం. అబ్దుల కలాం పేరు తీసి వైఎస్ఆర్ పేరు పెట్టటం. మీడియా పై కేసులు పెట్టే జీవో తీసుకు రావటం. వీటిలో కొన్నిటి పై వచ్చిన వ్యతిరేకత చూసి ప్రభుత్వం వెనక్కు తగ్గిన విషయం తెలిసిందే. ఇక తాజాగా జగన్ మోహన్ రెడ్డి ఇంటి కోసం, ఖర్చు పెట్టిన వివరాలు, మరీ ముఖ్యంగా 73 లక్షలతో, జగన్ ఇంటికి పెట్టిన అల్యూమినియం కిటికీల గురించి, జాతీయ మీడియా ఒక రేంజ్ లో విరుచుకు పడింది. అసలు ఆరు నెలలు క్రితం అంగరంగ వైభవంగా కట్టిన ఇంటికి, 73 లక్షల ప్రజా ధనంతో, కిటికీలు ఏంటి అంటూ, జాతీయ మీడియా విరుచుకు పడింది.
ఒక టీవీ కాదు, ఒక పేపర్ కాదు, దాదపుగా అన్ని ప్రముఖ ఛానెల్స్ మరియు పేపర్లలో, ఈ విషయం ప్రముఖంగా ప్రస్తావించారు. జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత, ఇప్పటి వరకు, దాదాపుగా 15.50 కోట్లు ఆయన ఇంటికి ఖర్చు పెట్టారని, అయితే సొంత ఇంటి కోసం, ప్రజా ధనం ఎందుకు వృధా చేస్తున్నారు అంటూ జాతీయ మీడియా ప్రశ్నించింది. అదీ కాక, జగన్ మోహన్ రెడ్డి, తన ఎన్నికల అఫిడవిట్ లో, తన ఆస్తి 510 కోట్లుగా చూపించారని, ఇది కేవలం వైట్ అని, మరి ఇన్ని వందల కోట్లు ఆస్తి ఉన్న వ్యక్తీ, కేవలం 15 కోట్లు కోసం, ప్రజా ధనం ఎందుకు వృధా చేస్తున్నారు, ఆయన సొంతగా ఖర్చులు పెట్టుకోవచ్చు కదా, ఎందుకు ప్రభుత్వ సొమ్ము తీసుకోవటం, అంటూ జాతీయ మీడియాలో కధనాలు వచ్చాయి.
జగన్ మోహన్ రెడ్డి గారు ఇప్పటి వరకు, 15 కోట్లు దాకా ఖర్చు పెట్టరు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. జగన్ నివాసం వద్ద 1.33 కిలోమీటర్లు పొడువు ఉన్న రహదారి విస్తరణకు, రూ.5 కోట్లు. జగన్ ఇంటి పరిసరాల్లో రక్షణ అవసరాలు కోసం, 1.89 కోట్లు. ఇంటి వద్దే ప్రత్యేకంగా హెలిప్యాడ్, దానికి ఫెన్సింగ్, కోసం రూ.40 లక్షలు. హెలిపాడ్ వద్ద సదుపాయాల కోసం రూ. 13.50 లక్షలు. జగన్ ఇంటి వద్ద, బారికేడింగ్ కోసం రూ. 75 లక్షలు. జగన్ ఇంటి, నిరంతరం విద్యుత్తు సరఫరా, నిర్వహణ కోసం, ఎలక్ట్రీషియన్ కు, రూ.8.50 లక్షలు. అత్యాధునిక విద్యుత్ వ్యవస్థ, లైట్స్, సీసీటీవీ సదుపాయం కోసం 3.63 కోట్లు. విద్యుత్ టాన్స్‌ఫార్మర్, హెచ్‌టీ లైన్, ఆధునిక లైటింగ్ సిస్టమ్‌కు రూ.97 లక్షలు. సీసీటీవీ, సోలార్ ఫెన్సింగ్ కోసం రూ. 1.25 కోట్లు. ఆధునిక ఏసీల ఏర్పాటుకు రూ.80 లక్షలు. క్యాంపు ఆఫీసు బయట లైటింగ్ కోసం రూ. 11.50 లక్షలు. జగన్ ఇంట్లో, వ్యూకట్టర్ ఏర్పాటు కోసం రూ.3.25 కోట్లు. తాజాగా, ఆల్యూమినియం తలుపులు, కిటికీలు కోసం, రూ. 73 లక్షలు. ఇలా మొత్తం, ఇప్పటి వరకు, దాదాపుగా, 15.65 కోట్లు ఖర్చు పెట్టారు.