జంగారెడ్డిగూడెంలో, వరుసమరణాలు కలకలం రేపుతున్నాయి. ఒకటి కాదు రెండు కాదు, ఏకంగా 25 మంది చనిపోయారు. గత రెండు మూడు రోజులుగా, ఈ సంఘటనలు జరిగాయి. పెద్దవాళ్ళు, జబ్బులు ఉన్న వాళ్ళు అయితే అనుకోవచ్చు కానీ, అక్కడ చనిపోయింది అంతా వయసులో ఉన్న వారే. వీరి మరణాలను కారణం కల్తీ నాటు సారా అని కుటుంబ సభ్యులే చెప్తున్నారు. ప్రతి రోజు సారా తాగుతున్నారని, మద్యం కొనుక్కోలేక సారాకి అలవాటు పడ్డారని వాపోతున్నారు. అయితే ఇంత మంది చనిపోవటంతో, ప్రభుత్వం పట్టించుకోక పోవటంతో, ప్రతిపక్షం రంగంలోకి దిగింది. ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ, ఈ అంశం పై నిజ నిర్ధారణ చేసి, నిజంగానే నటు సారా తాగి చనిపోయారని, తెలుగుదేశం పార్టీ నిర్ధారించటంతో, చంద్రబాబు నాయుడు ఈ రోజు నేరుగా బాధితుల వద్దకు వచ్చారు. నాటు సారా తాగి చనిపోవటం, ప్రభుత్వ భాధ్యాతారాహిత్యమే అని తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తుంది. చనిపోయిన ప్రతి ఒక్క కుటుంబానికి 25 లక్షల పరిహారం ప్రభుత్వం తరుపున ఇవ్వాలని, నాటు సారా దుకాణాలు, మాఫియా లేకుండా చూడాలని, చంద్రబాబు డిమాండ్ చేసారు. ఈ విషయం పైన తెలుగుదేశం పార్టీ, ఈ రోజు అసెంబ్లీలో కూడా ఆందోళన చేసి, ప్రభుత్వాన్ని నిలదీసింది.
అయితే ఈ విషయంలో కూడా జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎదురు దా-డి వ్యూహాన్నే ఎంచుకుంది. అక్కడ 25 మంది చనిపోతే, విషయం ఏమిటో అడ్రెస్ చేయకుండా, అక్కడ ఏమి జరగలేదు, అవన్నీ సహజ మరణాలే, తెలుగుదేశం పార్టీ స్మశానానికి వెళ్లి, అక్కడ చనిపోయిన వారి అందరినీ ఇక్కడకు తీసుకొచ్చి, ఆ లెక్కల్లో కలిపేసారు అంటూ, జుబుక్సారంగా వ్యవహరించటం మొదలు పెట్టింది. ఇది అందరినీ షాక్ కు గురి చేసే అంశం. చివరకు జగన్ మోహన్ రెడ్డి కూడా, ఇలాగే స్పందించారు. అక్కడ జనాభాలో 2 శాతం చనిపోవటం అనేది సర్వ సాదహరణ విషయం అని, దానికి నాటు సారా అంటూ లింక్ చేయటం ఏమిటి అంటూ, జగన్ అసెంబ్లీలో మాట్లాడారు. గతంలో ఎప్పుడూ ఈ నాటు సారా లేదా ? ఇప్పుడే కొత్తగా వచ్చిందా అంటూ, జగన్ మాట్లాడిన తీరు అందరినీ ఆశ్చర్య పరించింది. జగన్ మోహన్ రెడ్డి ఇలా మాట్లాడటం, ప్రభుత్వం స్పందించిన తీరు, అందరినీ షాక్ కు గురి చేసింది. చివరకు ఇది చర్చకు అడిగిన టిడిపి సభ్యులను, సభ ముగిసే వరకు సస్పెండ్ చేసారు.