ఏపీ ఎన్నికలలో విజయం తర్వుట వైఎస్ జగన్ ఢిల్లీ తన పై నమోదైన కేసులన్నీ కుట్రపూరితంగా పెట్టినవేనని.. ఆధారం లేనివే అని అన్నారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. శుక్రవారం కోర్టుకు హాజరవుతారా అని ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు ఆయన ఆసక్తికరమైన సమాధానం ఇచ్చారు. తనపై పెట్టిన కేసులేవీ నిలబడేవి కాదన్నారు. ఈ కేసులన్నీ వీగిపోతాయని అన్నారాయన. నాన్న రాజశేఖరరెడ్డి కాంగ్రెస్ లో ఉన్నంత కాలం తనపై కేసులేమీ లేవన్నారు. ఆయన చనిపోయిన తర్వాత… తాను పార్టీ పెట్టినప్పటినుంచే.. అటు కాంగ్రెస్ నాయకులు.. అటు టీడీపీ నాయకులు.. తనపై కక్ష కట్టి పిటిషన్లు వేశారన్నారు. పిటిషనర్లంతా కాంగ్రెస్, టీడీపీ నాయకులే అని అన్నారు.
అలాంటి వారు పెట్టిన కేసులు నిలబడవు అన్నారు. నేను అవినీతి చెయ్యలేదని, చెయ్యను అని తెలుసు కాబట్టే తనకు ఇంతటి భారీ విజయం కట్టబెట్టారని.. ప్రజాకోర్టులో నిర్దోషిలా నిరూపించుకున్నానని జగన్ అన్నారు. ఇక ముందు కూడా కోర్టులకు సహకరిస్తానని చెప్పారు. మరో పక్క అమిత్ షా తో భేటీ పై మాట్లాడుతూ, దేశంలో మోదీ అత్యంత శక్తిమంతుడైన వ్యక్తి అని, ఆ తర్వాతి స్థానం బీజేపీ అధ్యక్షుడైన అమిత్షాయే అని జగన్ పేర్కొన్నారు. అందుకే ఆయనను కూడా మర్యాదపూర్వకంగా, రాష్ట్ర ప్రయోజనాల కోసం కలిశానన్నారు. ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడు, మరో పార్టీ అధ్యక్షుడిని కలవడంలో ఆంతర్యం ఏమిటి అని ప్రశ్నించినప్పుడు ఇలా స్పందించారు. ‘మీరు చెప్పండి... దేశంలో నంబర్ 2 పవర్ఫుల్ వ్యక్తి ఎవరు!’’ అని మీడియాను ప్రశ్నించారు. జగన్ మోహన్ రెడ్డి, బీజేపీ నాయకుడు రాం మాధవ్ ను కూడా కలిసిన సంగతి తెలిసిందే.