రాష్ట్రంలో ఓటు దొంగలు పడిన విషయం తెలిసిందే. తెలంగాణాలో లాగా లక్షల లక్షల ఓట్లు తొలగించి, లబ్ది పొందే కుట్ర, బీహారీ గ్యాంగ్ ఆధ్వర్యంలో జరుగుతుంది. తెలుగుదేశం పార్టీకి చెందిన 8 లక్షల ఓట్లు తొలగించే అతి భారీ కుట్రకు తెర లేపారు. అయితే ఇప్పటి వరకు ఆన్‌లైన్‌లోనే వేలకొద్దీ ఫారం-7 అప్లికేషన్ల సమర్పణతో, ఈ ఓట్లు తొలగింపు జరుగుతుందని తెలుసు కాని, ఎవరు చేపిస్తున్నారో తెలియదు. మా ఓటు పోయింది అంటే మా ఓటు పోయింది అంటూ, సామాన్య ప్రజలు ఆందోళన చెందుతున్న టైంలో, ఓట్లు తొలగించమని చెప్పింది నేనే అంటూ, జగన్ మోహన్ రెడ్డి ఫ్రస్ట్రేషన్ లో నోరు జారారు. ఫారం 7 ఉపయోగించి, ఓట్లు తొలగిస్తుంది మేమే అంటూ, నెల్లూరు సభలో టంగ్ స్లిప్ అయ్యారు జగన్.
ఫారం 7 ద్వారా దొంగ ఓట్లుగా చెప్తున్నా ఓట్లు తొలగించమని మేము కోరితే చంద్రబాబుకి నొప్పి ఏంటి అంటూ, నెల్లూరు సభలో జగన్ అన్నారు. మొన్నటి దాక, అసలు మాకు, ఓట్లు తొలగింపుకు సంభందం ఏంటి అంటూ బుకాయిస్తున్న వైసీపీ నేతలకు, జగన్ మాటలు షాక్ ఇచ్చాయి. జగన్ కావాలని అన్నారో, నోరు జారి అన్నారో కాని, మేము ఇన్నాళ్ళు సమర్ధించి బకరాలు అయ్యాము అంటూ వాపోతున్నారు. రాష్ట్రంలో దాదాపు 100కి పైగా నియోజకవర్గాల్లో.. వీలున్నమేరకు ఓటర్లను తొలగించేందుకు భారీగా తప్పుడు ఫిర్యాదులు చేశారని టీడీపీ పేర్కొంటోంది. ఒక్కో నియోజకవర్గంలో 2-3 వేల ఓట్లు తొలగించాలనే దురుద్దేశంతో ఒక భారీస్థాయి వ్యూహం అమలు జరిగిందని అంటోంది. సుమారు 78,000 ఫిర్యాదులు వచ్చాయని సమాచారం. అంటే దాదాపు ప్రతి నియోజకవర్గంలోను సగటున 450 ఫిర్యాదుల వరకు వచ్చాయి. ఒక నియోజకవర్గంలో ఉన్న గ్రామాల సంఖ్య కంటే ఈ ఫిర్యాదుల సంఖ్య కొన్ని రెట్లు ఉంది. అంటే ప్రతి గ్రామంలోనూ కొన్ని ఫిర్యాదులు, పట్టణాలు, నగరాల్లో పదుల సంఖ్యలో ఫిర్యాదులు వెళ్లాయి. రాజకీయ యుద్ధంలో భాగంగా...ప్రత్యర్థి పార్టీని దెబ్బతీసేందుకు సాగుతున్న వ్యవహారమేనని అర్థమవుతోంది.
ఇక్కడ మరో అంశం కూడా కనిపిస్తోంది. నెల్లూరు జిల్లాలోని ఒక నియోజకవర్గంలో పలు బూత్‌లలో భారీగా ఓట్లు తొలగించాలని ఫిర్యాదుచేశారు. అయితే ఈ ఓటర్ల తొలగింపు ఫిర్యాదులో కూడా తెలివితేటలు ప్రదర్శించారు. తీసేయాలని కోరిన ఓటర్లలో 90 శాతం పైగా తెలుగుదేశం పార్టీకి చెందిన సామాన్య ఓటర్లున్నారు. వీరు సామాన్యులు కావడంతో.. అంతగా అందరికీ తెలియరు. ఎవరోలే అనుకుంటారు. అదే సమయంలో వైసీపీకి చెందిన కొందరు ముఖ్య నేతల పేర్లనూ ఫిర్యాదులో కలుపుతారు. వీరి పేర్లు సుపరిచితం కావడంతో.. స్థానికంగా టీడీపీ వాళ్లు ఆ ఫిర్యాదును చూసినా.. అది వైసీపీకే నష్టం కదా అని వదిలేస్తున్నారు. కానీ 90శాతం పైగా సామాన్య తెలుగుదేశం పార్టీ ఓట్లను పసిగట్టలేకపోతున్నారని టీడీపీ నాయకుడొకరు తెలిపారు. ఇంత పెద్దఎత్తున కుట్రను తమ అధినాయకత్వం ఊహించి ఉండదని అంటున్నారు.