మన ప్రతిపక్ష నాయకుడు ఎక్కడ ఉన్నా ఆల్ ఇండియా నెంబర్ వన్ గానే ఉంటాడు. అప్పట్లో ఎంపీగా పోటీ చేసినప్పుడు కూడా, అత్యంత ధనవంతుడైన ఎంపీగా పేరు తెచ్చుకున్నాడు జగన్. ఇప్పుడు ఎమ్మల్యేగా కూడా, అలాంటి ఘనతే సాధించాడు. ఎమ్మెల్యేల వ్యక్తిగత ఆదాయంలో వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ దేశంలోనే అగ్రస్థానంలో ఉన్నారు. కేవలం రాజకీయాలు మాత్రమే చేస్తూ, ఏ వ్యాపారం లేకుండా (జగన్ చెప్పిన లెక్కలు ప్రకారం), అత్యంత ధనవంతుడు జగన్. అయితే, మిగతా వ్యాపారాలు చేసే వాళ్ళతో పోల్చుకుంటే, మనోడు అయిదవ స్థానంలో ఉన్నాడు. ఈ మేరకు దేశంలో అన్ని రాష్ట్రాల్లో సిట్టింగ్‌ ఎమ్మెల్యేల వ్యక్తిగత ఆదాయం, వృత్తిపై ప్రజాస్వామ్య సంసంస్కరణల సంఘం (ఏడీఆర్‌) నివేదిక విడుదల చేసింది.

jagan 18092018

ఎన్నికల్లో ఇచ్చిన అఫిడవిట్లలో పేర్కొన్న వివరాల ఆధారంగా 4,086 సిట్టింగ్‌ ఎమ్మెల్యేల్లో 3,145 మంది వార్షిక ఆదాయ వివరాలను వెల్లడించింది. 3,145 మందిలో , మన జగన్ బాబు టాప్ లో ఉన్నాడు. కడప జిల్లా పులివెందుల ఎమ్మెల్యే అయిన జగన్‌ వార్షిక వ్యక్తిగత ఆదాయం రూ.13.92 కోట్లు ఉందని ఏడీఆర్‌ తెలిపింది. ఆయన జీవిత సహచరి, ఇతర కుటుంబ సభ్యుల ఆదాయంతో కలుపుకొని మొత్తం రూ.18.13 కోట్లు ఉంటుందని పేర్కొంది. అత్యధిక ఆదాయం కలిగిన టాప్‌-20 ఎమ్మెల్యేల్లో నెల్లూరు జిల్లా కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతా్‌పకుమార్‌రెడ్డి (14) కూడా ఉన్నారు. ఆయన వ్యక్తిగత ఆదాయం రూ.6.48 కోట్లు, కుటుంబ సభ్యుల ఆదాయాన్ని కలుపుకొని రూ.7.96 కోట్ల వార్షిక ఆదాయం ఉంటుందని ఏడీఆర్‌ సంస్థ తేల్చింది.

jagan 18092018

దేశంలోని మొత్తం 4,086 మంది ఎమ్మెల్యేల్లో 3,145 మంది తమ ఆదాయ వివరాలను అఫిడ్‌విట్‌లో వెల్లడించారు. వీరిలో 33 శాతం మంది ఐదో తరగతి నుంచి ఇంటర్ పూర్తిచేసిన వారు ఉన్నారు. వీరి వార్షిక వ్యక్తిగత ఆదాయం రూ.31.03 లక్షలు కాగా, 63 శాతం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్యేల వ్యక్తిగత సగటు ఆదాయం రూ.20.87 లక్షలే కావడం విశేషం. వ్యవసాయం, వ్యాపారాన్ని వృత్తిగా ప్రకటించిన 13% మంది ఎమ్మెల్యేల వార్షిక సగటు ఆదాయం అందరికంటే ఎక్కువగా (రూ.57.81 లక్షలు) ఉంది. శాసనసభ్యుల్లో 25-50 ఏళ్ల మధ్య 1,402 మంది, 51-80 లోపు 1,727 మంది, 82-90 మధ్య 11 మంది, ఆపై వయసున్నవారు ఇద్దరు ఉన్నారు. మొత్తం ఎమ్మెల్యేల్లో 8 శాతం మంది మాత్రమే మహిళలు ఉన్నారు. పురుష ఎమ్మెల్యేల సగటు వార్షికాదాయం రూ.25.85 లక్షలుకాగా, మహిళల ఆదాయం రూ.10.53 లక్షలే!..గృహిణులైన మహిళ ఎమ్మెల్యేల వ్యక్తిగత వార్షిక సగటు ఆదాయం రూ.3.79 లక్షలు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read