ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి గుజరాత్ అముల్ సంస్థ అంటే ఎంత ప్రేమో అందరికీ తెలిసిందే. అమూల్ సంస్థ కోసం ఇక్కడ మన రాష్ట్రంలో ఉన్న సహకార సంఘాలను కూడా నిర్వీర్యం చేయటమే కాదు, ధూలిపాళ్ళ నరేంద్ర లాంటి వారిని ఎలా టార్గెట్ చేసారో అందరం చూసాం. అమూల్ సంస్థ కోసం ఎన్నిఎన్ని రాయతీలు, ఎంత ప్రాధాన్యత ఇచ్చారో అందరూ చూసారు. ఏకంగా గ్రామాల్లోకి వెళ్లి, వేరే వారికి పాలు పోయోడద్దు, మాకే పాలు పోయాలి అంటూ, కొంత మంది బెదిరించారు అని కూడా వార్తలు వచ్చాయి. అత్యుత్సాహం ఎక్కువ ఉన్న వాళ్ళు, అమూల్ సంస్థకు పాలు పోయక పొతే ఏకంగా పధకాలు కూడా ఆపేస్తాం అనే స్థాయికి కూడా వెళ్ళారు. ఇక్కడ వరకు అంతా బాగానే ఉంది. అమూల్ సంస్థ కోసం రాష్ట్ర ప్రభుత్వం, ఇంతలా పాకులాడటం వెనుక ఉన్న మతలబు ఏమిటో పక్కన పెడితే, ఇంత చేస్తున్న మన రాష్ట్రానికి అమూల్ సంస్థ ఏదో ఒక విధంగా ఆదుకుంటుందని అందరూ భావించారు. కానీ అమూల్ సంస్థ ప్రభుత్వ పెద్దలను ఏ విధంగా ఆదుకుందో తెలియదు కానీ, మన రాష్ట్రానికి మాత్రం భారీ దెబ్బ కొట్టిందనే చెప్పాలి. అమూల్ సంస్థ మన దగ్గర పాలు కొంటూ, ఇక్కడ ఏమి పెట్టుబడులు పెట్టకుండా, పక్క రాష్ట్రమైన తెలంగాణాలో భారీ పెట్టుబడి పెట్టి అందరికీ షాక్ ఇచ్చింది.

amul 01012022 2

ఇది న్యూ ఇయర్ లో జగన్ మోహన్ రెడ్డి గారికి షాక్ అనుకోవాలో, లేక మన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు షాక్ ఆనుకోవాలో కానీ, అమూల్ సంస్థ చేసిన పనికి అందరూ అవాక్కయ్యారు. అమూల్ సంస్థ తెలంగాణా రాష్ట్రంలో ఏకంగా రూ.500 కోట్లతో పెట్టుబడి పెట్టటానికి ఆ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. అమూల్ సంస్థ కోసం బ్రాండ్ అంబాసిడర్ గా పని చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కాదని, తెలంగాణాలో పెట్టుబడి పెట్టారు అంటే, మన రాష్ట్రం పై వాళ్ళకున్న అభిప్రాయం వ్యక్తం అవుతుంది. రెండు రోజుల క్రితమే జగనన్న పాల వెల్లువ అనే పధకం కూడా ప్రారంభించారు. ఇప్పుడు కట్ చేస్తే ఇది పరిస్థితి. దీని వెనుక ఉన్న స్కెచ్ ఏంటో, దీని వెనుక ఉన్న రాజకీయ ప్రయోజనాలు ఏమిటో, ఎవరు వ్యక్తిగతంగా లబ్ది పొందుతున్నారో కానీ, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మాత్రం ఇది షాక్ అనే చెప్పాలి. ఒక పక్క రాష్ట్రంలో పెట్టుబడులు రావటం లేదు అని బాధ పడుతుంటే, మన రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యత ఇచ్చిన కంపెనీ కూడా ఇలా చేయటం, నిజంగా మన దౌర్భాగ్యమే.

Advertisements

Advertisements

Latest Articles

Most Read