ఈ అన్యాయస్తుడు అనే పదం ఎక్కడిది అంటారా ? మాకు తెలీదు... జగన్ ఎప్పుడూ ఈ మాటనే చంద్రబాబు మీద ఉపయోగిస్తూ ఉంటారు... ఇప్పుడు జగన్ కు చంద్రబాబే కాదు, ఈనాడు సంస్థల అధినేత రామోజీ రావు కూడా అన్యాయస్తుడు అయిపోయారు... అందరి దగ్గర బాధపడుతూ, రామోజీ రావు ఇంత అన్యాయస్తుడు అనుకోలేదు అంటూ బాధ పడుతుంటే, వాళ్ళు జగన్ ని రివర్స్ ఓదార్పు యాత్ర చేస్తున్నారు... అయినా నీ లాంటి నిజాయతీ పరుడు, కష్టపడి డబ్బు సంపాదించి, చిన్న వయసులో పైకి వచ్చిన నువ్వు వెళ్లి, ఆ రామోజీని రెండు సార్లు ఎందుకు కలిసావ్ అన్నా అంటూ జగన్ ని ప్రశ్నిస్తున్నారు.... మన రేంజ్ కు రామోజీ దగ్గరకు మనం వెళ్ళటం ఏంటి అంటున్నారు...
విషయంలోకి వస్తే, తన పాదయాత్రకు సంపూర్ణ సహకారం అందించాలి అని, జగన్ రామోజీ ఇంటికి వెళ్లి స్వయానా కలిసి, వైరాన్ని కూడా పక్కన పెట్టి, కాళ్ళ బేరానికి వెళ్ళాడు... నా పాదయాత్ర, నా సాక్షి లోనే వేసుకుంటే, కామెడీ అయిపోతుంది అని, మీ ఈనాడు అంటే రాష్ట్ర ప్రజలకు నమ్మకం అని, మా నాన్నకు ఎలా అయితే సహకరించారో, నాకు కూడా అలాగే సహకరం అందించి, మీ ఈ టీవీలో , ఈనాడు పపెర్ లో నా పాదయత్ర నాన్ స్టాప్ కవరేజ్ ఇవ్వండి అంటూ జగన్ రామోజీతో ప్రాధేయపడ్డాడు... ఇంతకు ముందు కూడా నిరాహార దీక్ష చేసే సమయంలో రామోజీ ఇంటికి వెళ్లి, కవర్ చెయ్యమని ప్రాధేయపడ్డాడు.. అప్పుడు, ఇప్పుడు కూడా, కాళ్ళ బేరానికి వెళ్లిన జగన్ కు రామోజీ రావు ఎక్కడా సహకరించటం లేదు...
మొదటి రోజు మాత్రం పాదయత్ర లైవ్ ఇచ్చి, జగన్ ని ఉత్సాహ పరిచారు రామోజీ... ఈ టీవీ మాత్రమే కాదు, మిగతా చానల్స్ కూడా మొదటి రోజు పాదయత్ర చూపించాయి... తరువాత రోజు నుంచి, ఎవరూ పట్టించుకోవటం లేదు... సాక్షిలో క్రియేటివ్ టీమ్స్, రెచ్చిపోతుంటే, మిగతా చానల్స్ మాత్రం లైట్ తీసుకున్నాయి... అలాగే ఈనాడు పేపర్ లో కూడా, జగన్ పాదయత్ర కంటే, పారడైస్ పేపర్స్ లో జగన్ భాగోతాలు హై లైట్ చేస్తూ, చూపిస్తుంది.. జగన్ విదేశాల నుంచి డబ్బులు ఎలా మళ్ళించింది విడమర్చి రాసింది ఈనాడు... ఒకటికి రెండు సార్లు స్వయంగా రామోజీ ఇంటికి వెళ్లి ప్రాధేయపడినా, రామోజీ మాత్రం కనికరించలేదు... అందుకే రామోజీ రావు, జగన్ కు అన్యాయస్తు అయిపోయారు....