నిత్యం వార్తల్లో ఉండాలి... చంద్రబాబు, పాలన మీద ఫోకస్ చెయ్యకుండా చెయ్యాలి అనే ఐడియా ఇచ్చిన ప్రశాంత్ కిషోర్ సూచన మేరకు జగన్, మరికొన్ని ఎన్నికలు జరపటానికి ప్లాన్ వేస్తున్నారు. కాని, తన పార్టీ వాళ్ళే ఆ ప్లాన్ కు సహకరించక పోవటంతో జగన్ అసహనంగా ఉన్నారు.

చంద్రబాబుని 20 మంది ఫిరాయిపు MLAల చేత రాజీనామా చేసి, ఎన్నికలకు రావాల్సిందిగా జగన్ ఛాలెంజ్ చేశారు. నిజానికి ఈ ఛాలెంజ్ వెనుక, జగన్ ప్రశాంత్ కిషోర్ కి వేరే వ్యూహం ఉంది. అదే, చంద్రబాబు పాలన మీద ఫోకస్ చెయ్యకుండా చెయ్యాలి అనే ఐడియా. కాని చంద్రబాబు దీనిలోని మర్మం కనిపెట్టి, ఆ ఛాలెంజ్ పట్టించుకోలేదు.

దీంతో జగన్, ఇప్పుడు మళ్ళీ తాను మోడీకి మాట ఇచ్చి వదిలేసిన "ప్రత్యక హోదా" పట్టుకోనున్నారు. తన MPలు చేత రాజీనామా చేయించి, "ప్రత్యక హోదా" కోసం మా చిత్తసుద్ధి ఇది అని చెప్పనున్నారు. కాని, జగన్ కు సొంత MPలు షాక్ ఇచ్చారు. 8 మందిలో, ముగ్గురు మాత్రమే, రాజీనామాకు ఒప్పుకున్నారు. మిగతావారు, మేము రాజీనామా చేసేది లేదని తేల్చి చెప్పారు. మన మీద ప్రజల మీద ఏ అభిప్రాయం ఉందో తెలిసి కూడా, ఎలా రాజీనామా చెయ్యమంటారు, మీరు ఎలాగూ మునిగిపోయారు, మా రాజకీయ జీవితం కూడా నాశనం చేస్తారా అని MPలు వాపోయారు.

దీంతో జగన్ తీవ్ర అసహనానికి గురై, సమావేశం నుంచి అర్ధాంతరంగా వెళ్ళిపోయారు. నిజానికి, 2 MPలు బిజేపి లో చేరటానికి ఇప్పటికే నిర్ణయించుకున్నారు, మరి కొంత మంది తెలుగుదేశం పార్టీతో టచ్ లో ఉన్నారు. ఇది పసి గట్టిన జగన్, వారు వేరే వెళ్ళకుండా, అలాగే ప్రజల్లో ప్రత్యెక హోదా సెంటిమెంట్, రెండు విధాలుగా ఉపయోగ పడుతుంది అని ప్లాన్ వేశారు... కాని యధావిధిగా ఈ ప్లాన్ కూడా ఫ్లాప్ అయ్యింది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read