జగన్ మోహన్ రెడ్డి ఈ రోజు జరిగిన క్యాబినెట్ సమావేశంలో సంచలన వ్యాఖ్యలు చేసారు. సహజంగా క్యాబినెట్ సమావేశంలో రాష్ట్ర ప్రగతి పై నిర్ణయాలు తీసుకుంటారు. అయితే ఇక్కడ మాత్రం రాజకీయాల పై సంచలన వ్యాఖ్యలు వచ్చాయి. అంతే కాదు, రెండున్నరేళ్ళకే ఇలాంటి వ్యాఖ్యలు రావటం పట్ల అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ రోజు జరిగిన క్యాబినెట్ సమావేశంలో స్పష్టమైన సంకేతాలను జగన్ మోహన్ రెడ్డి, మంత్రులకు ఇచ్చారు. క్యాబినెట్ సమావేశం చివరిలో, ఆయన మంత్రులతో మాట్లాడారు. ఆ సందర్భంగా, ఆయన మాట్లాడుతూ, ఎన్నికలకు రెడీ అవ్వాలి అంటూ, మంత్రులకు చెప్పటంతో అందరూ షాక్ తిన్నారు. ఇంకా రెండున్నరేళ్ళు ఉండగా, ఇప్పుడే ఇదేమిటి అంటూ షాక్ తిన్నారు. వచ్చే ఏడాది మే నాటికి మూడు సంవత్సరాలు పూర్తవుతుంది. అయితే ఇప్పటి నుంచే ఎన్నికలకు రెడీ అవ్వాలి అని జగన్ చెప్పటం పై అందరూ షాక్ తిన్నారు. దీంతో పాటుగా, మరో సంచలన ప్రకటన కూడా జగన్ మోహన్ రెడ్డి చేసారు. ప్రశాంత్ కిషోర్ టీం కూడా త్వరలోనే రంగంలోకి దిగుతుంది అంటూ, మంత్రులకు చెప్పారు. ప్రశాంత్ కిషోర్ టీం వస్తుందని అంటేనే, ఎన్నికలకు వీరు రెడీ అవుతున్నారని, ఎన్నికలకు సన్నధం అవుతున్నారని స్పష్టం అవుతుంది.
అయితే ఇక్కడ ఆలోచించాల్సిన అంశం, జగన్ మోహన్ రెడ్డి ముందస్తు ఎన్నికలకు వెళ్ళే ఆలోచనలో ఏమైనా ఉన్నారా అనేది కూడా చర్చ జరుగుతుంది. లేకపోతే ఇంకా సగం టైం మిగలి ఉండగానే, ఎన్నికలకు రెడీ అవ్వమని చెప్పటం ఏమిటో ఎవరికీ అర్ధం కావటం లేదు. ప్రశాంత్ కిషోర్ టీం వచ్చే లోపే, పార్టీ నేతలు అందరూ ప్రజల్లోకి వెళ్ళే కార్యక్రమాలు అన్నీ రూపొందించుకోవాలి అంటూ ఆయన స్పష్టం చేసారు. త్వరలోనే గడపగడపకు వైఎస్ఆర్ అనే కార్యక్రమం ప్రారంభించాలని అన్నారు. ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడు ఇక నుంచి ప్రజల్లోనే ఉండాలని, ప్రభుత్వ కార్యక్రమాలు అన్నీ ప్రజలకు చెప్పాలని, ఇక ఎన్నికల మూడ్ లోకి వెళ్లిపోవాలి అనే విషయం స్పష్టం అవుతుంది. అలాగే ప్రస్తుతం ఉన్న మంత్రుల్లో 80 శాతం మంది వరకు ఎన్నికల బాధ్యతులు ఇస్తామని చెప్పినట్టు సమాచారం.