జగన్ మోహన్ రెడ్డి అప్పుడే ఎన్నికలు గేలిచేసినట్టు, ముఖ్యమంత్రి అయిపోయినట్టు, క్యాబినెట్ మంత్రులని నియమించినట్టు కలలు కంటున్నారు. మర్రి రాజశేఖర్‌తో వచ్చిన గొడవలో జగన్ ఇలా ఫీల్ అయిపోతున్నారు. అసలు కధ ఏంటో తెలుసుకుందాం.. వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మర్రి రాజశేఖర్‌తో ఆ పార్టీ నాయకులు ఆళ్ల అయోధ్యరామిరెడ్డి ఆదివారం ఇక్కడ సమావేశమయ్యారు. వైసీపీ అధినేత జగన్‌ సూచన మేరకు చిలకలూరిపేటలోని మర్రి రాజశేఖర్‌ నివాసగృహానికి చేరుకున్న ఆళ్ల ఆయనతో సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా రాజశేఖర్‌ నివాసం వద్దకు పెద్దఎత్తున చేరుకున్న వైసీపీ నాయకులు, కార్యకర్తలు, ఆయన అనుచరులతో అయోధ్యరామిరెడ్డి మాట్లాడారు.

jagan 22102018 1

మర్రి రాజశేఖర్‌ సేవలను పార్టీ ఎప్పటికీ మరచిపోదని.. 40 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన కుటుంబం నుంచి వచ్చిన రాజశేఖర్‌ను గౌరవించుకోవడం తన బాధ్యత అని జగన్‌ చెప్పారని అయోధ్యరామిరెడ్డి పేర్కొన్నారు. వచ్చే ఎన్నికలలో రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వస్తుందని, మర్రికి మంత్రి పదవి ఇస్తామని జగన్‌ తన మాటగా చెప్పమన్నారన్నారు. రాజశేఖర్‌ అన్నా, ఆయన కుటుంబం అన్నా జగన్‌కు ఎంతో గౌరవం ఉందన్నారు. రాజశేఖర్‌ నాయకత్వం గురించి కూడా జగన్‌కు తెలుసన్నారు. చిలకలూరిపేటలో ఉన్న పరిస్థితుల దృష్ట్యా జగన్‌ అసెంబ్లీ సీటు విషయంలో ఒక నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు.

jagan 22102018 1

వచ్చే ఎన్నికలలో చిలకలూరిపేట నియోజకవర్గంలోనే కాకుండా జిల్లాలోని అన్ని నియోజకవర్గాలలో రాజశేఖర్‌ ఆలోచనలతో పార్టీని ముందుకు తీసుకెళ్లాలని జగన్‌ కోరారన్నారు. కొంతమంది కార్యకర్తలు మాత్రం మర్రికి అన్యాయం చేశారని వాపోయారు. రాజకీయాలలో సహనం, త్యాగం అవసరమని కార్యకర్తలు సంయమనం పాటించాలని ఆయోధ్యరామిరెడ్డి కోరారు. అనంతరం మర్రి రాజశేఖర్‌ కలుగజేసుకుని కార్యకర్తలకు సర్ది చెప్పారు. ఈ సందర్భంగా రాజశేఖర్‌ మాట్లాడుతూ జగన్మోహనరెడ్డి ఆదేశాల మేరకు ఆయన నాయకత్వంలో పనిచేసి చిలకలూరిపేట నియోజకవర్గంలో వైసీపీ గెలుపే లక్ష్యంగా కృషిచేస్తానన్నారు. అయితే కార్యకర్తలు మాత్రం, ఆయన ముఖ్యమంత్రి అవ్వకపోతే, మీకు కనీసం ఎమ్మల్యే కూడా ఉండదని, ఈ మాటలు నమ్మకుండా, టికెట్ కోసం ఒత్తిడి తేవాలని కోరారు..

Advertisements

Advertisements

Latest Articles

Most Read