కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలు వచ్చాయి. రాష్ట్రంలో ప్రధాన ప్రతి పక్ష పార్టీ నాయకుడు జగన్ మోహన్ రెడ్డి మాత్రం వేరే పనిలో ఉన్నారు. ఒక పక్క ఫలితాలు వస్తుంటే, దాని మీద కనీసం సమీక్ష కూడా చేసే అవకాశం లేదు పాపం.
ఎందుకంటే, ఇవాళ శుక్రువారం... జగన్ సిబిఐ కోర్ట్ లో హాజరు కావలి.. అందుకే జగన్, ఫలితాలు కూడా చూడకుండా, అక్రమాస్తుల కేసు విచారణకు వెళ్లారు.
నిన్ననే హై కోర్ట్ కూడా మొట్టికాయలు వేసింది. ఎట్టి పరిస్థుతుల్లో కోర్ట్ కు విచారణకు హాజరు కావాల్సిందే అని తేల్చి చెప్పింది. దీంతో జగన్, ఏంటో బాధతో నాంపల్లి కోర్ట్ కు వెళ్లారు.
Advertisements