నిన్న విజయసాయి రెడ్డి మాట్లాడుతూ, మా జగన్ చేసే ప్రతి పని, ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్ షా లకు చెప్పే చేస్తున్నాం అని, అన్ని విషయాలు వాళ్లకు చెప్పి, వాళ్ళ అంగీకారంతోనే చేస్తున్నాం అంటూ మీడియాతో చెప్పుకొచ్చారు. నిన్న విలేఖరులతో మాట్లాడుతూ, విద్యుత్ ఒప్పందాల రాద్దు, పోలవరం రీటెండరింగ్ పై కేంద్రం, మీ పై గుర్రుగా ఉంది కదా అని అడిగిన సందర్భంలో, ఏమి లేదు, అన్నీ వాళ్ళకు చెప్పే చేస్తున్నాం అని చెప్పిన సంగతి తెలిసిందే. అయితే, ఈ వ్యాఖ్యల పై ఇప్పటికే బీజేపీ నేతలు తిప్పి కొట్టగా, ఈ రోజు బీజేపీ ఏపి అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారయణ కూడా విజయసాయి రెడ్డి మాటలు ఖండించారు. ఈ విషయం పై అధిష్టానికి ఫిర్యాదు చేస్తానని, వాళ్ళు చేసిన తప్పులు, మా మీదకు నెట్టే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. ఇప్పుడు కేంద్రం మంత్రులు కూడా ఈ విషయాల పై విజయసాయి రెడ్డికి కౌంటర్ ఇస్తున్నారు.
విద్యుత్ ఒప్పందాల రద్దు పై ప్రధానికి, హోం మంత్రికి చెప్పి చేస్తున్నాం అని విజయసాయి రెడ్డి అంటే, కేంద్ర విద్యుత్ మంత్రి ఆర్కే సింగ్ బుధవారం మీడియాతో మాట్లాడుతూ, విద్యుత్ ఒప్పందాల సమీక్ష విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెనక్కు తగ్గిందని చెప్పారు. ఈ మేరకు మాకు లేఖ రాసారని, ముందుగా చెప్పినట్టు అన్ని విద్యుత్ ఒప్పందాలు సమీక్ష చెయ్యటం లేదని, ఎక్కడైతే అనుమానం ఉందొ, అవి మాత్రమే చేస్తున్నామని, రాష్ట్ర ప్రభుత్వం మాకు చెప్పిందని కేంద్ర మంత్రి అన్నారు. అయితే తాజాగా జగన్ మోహన్ రెడ్డి, ప్రధానమంత్రి కార్యాలయం కార్యాలయం నుంచి లేఖ వచ్చినట్టు తెలుస్తుంది. పెద్ద ఎత్తున దేశంలో విదేశీ పెట్టుబడులు వస్తున్న నేపధ్యంలో, మీరు ఇలా చేస్తే కనుకు, ఆ ఎఫెక్ట్ మొత్తం దేశం మీద పడుతుందని, ఆ లేఖలో రాసినట్టు సమాచారం.
అయితే ఈ విషయం పై ఇప్పటికే అనేక సార్లు కేంద్రం, జగన్ మోహన్ రెడ్డిని హెచ్చరించింది. అయినా జగన్ దిగి రాలేదు. అలాగే ట్రిబ్యునల్ వార్నింగ్ ఇచ్చింది. మరో పక్క 42 కంపనీలు హై కోర్ట్ కు వెళ్ళటంతో, కోర్ట్ కూడా మొట్టికాయలు వేసింది. అయినా సరే జగన్ మోహన్ రెడ్డి విద్యుత్ ఒప్పందాలు సమీక్షించి తీరుతానని కూర్చున్నారు. ఈ నేపధ్యంలో, వారం క్రితం జపాన్ రాయబారి కార్యాలయం నుంచి, అటు కేంద్ర ప్రభుత్వానికి, ఇటు జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వానికి, ఘాటు లేఖ రావటంతో, ఇక డైరెక్ట్ గా ప్రధాని మంత్రి కార్యాలయం రంగంలోకి దిగింది. దీంతో, ఇక జగన్ మోహన్ రెడ్డి, తప్పనిసరిగా, తగ్గాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ నేపధ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం చేసిన డ్యామేజ్ ని తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు, కేంద్ర మంత్రి.