జగన్ మోహన్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలి అంటూ, రఘురామకృష్ణం రాజు వేసిన పిటీషన్ నిన్న సిబిఐ కోర్టులో విచారణకు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ సందర్భంగా జరిగిన ఒక పరిణామం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షించింది. సిబిఐ చేసిన పనితో, అందరు ఒకింత ఆశ్చర్యానికి గురయ్యారు. సిబిఐ వైఖరిలో ఈ మార్పు ఎటు వైపు దారి తీస్తుంది అనే విషయంతో పాటుగా, కేంద్రం వైఖరి కూడా ఈ దెబ్బతో బయట పడనుందనే వాదన వస్తుంది. ఇక విషయానికి వస్తే రఘురామకృష్ణం రాజు జగన్ బెయిల్ పిటీషన్ రద్దు చేయాలి అంటూ, గతంలో ఆయన పిటీషన్ వేసిన సమయంలో, సిబిఐ కోర్టు, అటు జగన్ మోహన్ రెడ్డితో పాటుగా, సిబిఐని కూడా కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా కోరింది. అయితే రెండు వాయిదాల్లో సిబిఐ ఏమి కౌంటర్ ఇవ్వలేదు. ఇక మూడో సారి మాత్రం ఏక వాఖ్యంతో సిబిఐ కౌంటర్ ఇచ్చింది. సిబిఐ కోర్ట్ ఏమి చెప్తే , ఏ నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడి ఉంటాం అంటూ, సిబిఐ తన కౌంటర్ ఇచ్చింది. అయితే ఈ కౌంటర్ పై గతంలో భిన్న వాదనలు వచ్చాయి. సిబిఐ ఏదో ఒకటి చెప్పాలి కానీ, ఇలా తప్పించుకే ధోరణిలో, ఇలా కౌంటర్ వేయటం పై అందరూ ఆశ్చర్య పోయారు. సిబిఐ వైఖరి పై పలువురు అనుమానం కూడా వ్యక్తం చేస్తూ, విమర్శలు గుప్పించారు.
అయితే నిన్న జరిగిన వాయిదాలో సిబిఐ అనూహ్య నిర్ణయం తీసుకుంది. అటు రఘురామకృష్ణం రాజు తరుపు న్యాయవాది, సిబిఐ ఈ విషయంలో ఏదో ఒకటి చెప్పాలి అంటూ కోర్టులో వాదించటంతో పాటుగా, బయట నుంచి వస్తున్న విమర్శలతో కానీ, లేదా మరో వ్యూహంతో కానీ సిబిఐ అనూహ్య నిర్ణయం తీసుకుంది. రఘురామకృష్ణం రాజు, జగన్ మోహన్ రెడ్డి , ఇద్దరి వాదనలు విన్నాం అని, తాము కూడా ఈ సారి వాయిదాకి, రిటన్ ఆర్గుమెంట్స్ ఇస్తాం అంటూ, ప్రకటించింది. సిబిఐ కోర్టు కూడా సిబిఐ నిర్ణయం చెప్పమని కోరింది. దీంతో గతంలో కోర్టు ఏ నిర్ణయం తీసుకున్న ఒకే అంటూ చెప్పిన సిబిఐ, ఇప్పుడు వాదనలు చెప్తాం అని చెప్పటం వెనుక ఉన్న వ్యూహం ఏమిటో అర్ధం కావటం లేదు. సిబిఐ కేంద్ర హెం శాఖ పరిధిలో ఉంటుంది కాబట్టి, సిబిఐ ఇచ్చే వాదనలు కేంద్రం , జగన్ పై ఉన్న వైఖరిని తెలియ చేస్తాయని విశ్లేషకులు అంటున్నారు. సహజంగా తాము విచారణ చేసి, చార్జ్ షీట్లు వేసిన వారికి అనుకూలంగా సిబిఐ వ్యవహరించే అవకాసం ఉండదు. మరి సిబిఐ ఏమని చెప్తుందో, 8వ తారీఖు తేలిపోనుంది.