కేంద్ర మానవ వనరుల శాఖా మంత్రి స్మ్రితి ఇరానీ పేరుని కూడా, జగన్ బ్యాచ్ ఫుల్ గా వాడేస్తుంది... లోకల్ పైడ్ బ్యాచ్ తో, బీహార్ ప్రశాంత్ కిషోర్ బ్యాచ్ కలిసి, సోషల్ మీడియాని ఎలా ఫేక్ చేస్తున్నారో చూస్తూనే ఉన్నాం... ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు చెయ్యటంలో వీరు దిట్ట... ఫోటోలు, వీడియోలు మార్ఫింగ్ చేసి, ప్రజలను అదే నిజం అని నమ్మించటంలో వీరు దిట్ట... ప్రశాంత్ కిషోర్ తిమ్మిని బొమ్మని చేసి, ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు చేసే మాంత్రికుడిగా పేరు... ముఖ్యంగా సోషల్ మీడియాలో, పీకే బ్యాచ్ చేసే రచ్చ ఇంతా అంతా కాదు... ఇదే పని లోటస్ పాండ్ లో, జగన్ కిరాయి బ్యాచ్ చేస్తున్నా, జగన్ మాత్రం, పేకే బ్యాచ్ మీదే ఎక్కువ నమ్మకం పెట్టుకున్నాడు...

jagan fake 28012018 2

పీకే ఆంధ్రప్రదేశ్ వచ్చిన కొత్తలో, ఈ ఫేక్ ఎకౌంట్లతో హడావిడి చేసి దొరికిపోయాడు... అస్సాం, బీహర్, జమ్మూ ప్రొఫైల్స్ ఉన్న వాళ్ళు, మన రాష్ట్రం గురించి తెలుగులో పోస్ట్లు పెడుతూ, దొరికిపోయారు... తరువాత, చాలా జాగ్రత్తగా ఆ ఎకౌంట్లు పేర్లు మార్చేశారు... తెలుగు పేర్లు పెట్టుకుని, హడావిడి చేస్తున్నారు... ఈ క్రమంలో, స్ట్రాటజీ మార్చారు... ప్రముఖుల పేర్లతో, ఫేక్ అకౌంట్ లు క్రియేట్ చేసి, ఆ ప్రొఫైల్స్ నిజమైనవిగా నమ్మించి, ముఖ్యమంత్రి చంద్రబాబుని తిడుతున్నారు... అదే విధంగా జగన్ ని పోగుడుతున్నారు...

jagan fake 28012018 3

ఇదే క్రమంలో, కేంద్ర మానవ వనరుల శాఖా మంత్రి స్మ్రితి ఇరానీ పేరుతో ఒక ట్విట్టర్ ఐడి క్రియేట్ చేసారు... దాని నుంచి, ఒక ట్వీట్ వచ్చింది... "జగన్ అన్న, వెయ్య కిమీ పాదయాత్ర పూర్తి చేసారు.. జగన్ అన్నతో నడవండి, రాజన్న రాజ్యం తీసుకురండి" అంటూ సాక్షాత్తు కేంద్ర మంత్రి పేరుతో ఫేక్ పనులు చేస్తున్నారు... ఇవి వీరి ఫేక్ బ్రతుకులు.... వీళ్ళు చెప్పేవి అన్నీ అబద్ధాలే... ఒక్కటి కూడా నిజం ఉండదు... చివరకి, వీడియోలో వాయిస్ కూడా ఫేక్ చేసి నిజం అని నమ్మిస్తున్నారు... బహు పారాక్ ఆంధ్రుడా... పోలీసు శాఖ కూడా, ఇలాంటి వాటి మీద చర్యలు తీసుకోవాలి...

Advertisements

Advertisements

Latest Articles

Most Read