వైసీపీ వాళ్ల ప్రచార పిచ్చి చూస్తుంటే యావగింపు కలుగుతోంది. గతంలో కియా మోటార్స్ విషయంలోనూ ఇలాగే ప్రవర్తించి తాము బకరాలు కావడమే కాదు, ఏకంగా తమ కోసం పనిచేసే వైసీపీ పేటీఎం బృందాలనీ గొర్రెలని చేసేశారు. కియా మోటార్స్‌ని ఎంతో కష్టపడి రాష్ట్రానికి చంద్రబాబు తీసుకొచ్చారు. ఆ సమయంలో కమీషన్ల కోసం బాబు తెచ్చారని, అమ్ముడుపోని కార్ల కంపెనీ పెట్టించారని వైకాపా పెద్దలే ఆరోపించారు. తీరా కియా కార్ల ఉత్పత్తి ప్రారంభమై ఏపీ పేరు మారుమోగడంతో ఆ క్రెడిట్ ఎలాగైనా కొట్టేయాలని రాజశేఖర్ రెడ్డి బతికి వున్నప్పుడే కియా ప్లాంట్ ఏర్పాటు చేయాలని ఆ యాజమాన్యానికి లేఖ రాసినట్లు ఓ ఫేక్ లెటర్ సృష్టించారు. అంటే జగన్ చేస్తేనే అభివృద్ధి. జగన్ వేస్తేనే శంకుస్థాపన అనే చందంగా తయారయ్యారు వైసీపీ టీమ్. వైకాపా అధినేత జగన్ రెడ్డిని సంతృప్తి పరచడానికి సొంత పార్టీ నేతలే కాదు, అధికారులు కూడా గతంలో టిడిపి ప్రభుత్వం చేసిన శంకుస్థాపనలపై మళ్లీ శంకుస్థాపనలు చేయిస్తున్నారు. ఏ ముఖ్యమంత్రి అయినా ఆ రాష్ట్రంలో గత ప్రభుత్వం వేసిన శంకుస్థాపనలని పూర్తి చేస్తారు. దీనికి భిన్నంగా ఆ ప్రాజెక్టుపై గత ప్రభుత్వ ముద్ర ఉండకూడదనే కోణంలో ఏకంగా అదే ప్రాజెక్టులకి మళ్లీ పేర్లు మార్చి మరీ శంకుస్థాపన చేసుకుంటున్నారు. గతంలో టిడిపి ప్రభుత్వం ఉత్తుత్తి శంకుస్థాపన చేసిందని, తామే చేస్తున్నదే గట్టి శంకుస్థాపన అని ప్రచారం చేసుకుంటున్నారు.
భోగాపురం ఎయిర్ పోర్టుకి 4 ఏళ్ల క్రితమే అప్పటి సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేశారు. అప్పుడు కేసులు వేయించి నిర్మాణాలు ముందుకు సాగకుండా అడ్డుకున్నది వైసీపీ అధినేత జగన్ రెడ్డే. ఇప్పుడు అదే నోటితో భోగాపురం ఎయిర్ పోర్టు తాను కడుతున్నానని, అదే చేత్తో మరోసారి శంకుస్థాపన చేశారు. ఐటీ హబ్‌గా విశాఖ తీర్చిదిద్దేందుకు 2019 సంవత్సరంలో ఫిబ్రవరి 14న అదానీ డేటా సెంటర్ అండ్ టెక్నాలజీ పార్క్ ఏర్పాటుకి ఏపీ సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేశారు. మళ్లీ అదే అదానీ డేటా పార్క్ కి ఇప్పుడు జగన్ శంకుస్థాపన చేశారు. కడప ఉక్కు పరిశ్రమ కోసం 2007 జూన్ 10న అప్పటి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి భూమిపూజ చేశారు. వైఎస్ చనిపోవడంతో ఆ ఫ్యాక్టరీ ప్రతిపాదన కార్యరూపం దాల్చలేదు. కడప స్టీల్ ప్లాంటు నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వమే పూనుకుంటుందని ప్రకటించిన అప్పటి సీఎం చంద్రబాబు 2018లో శంకుస్థాపన చేశారు. తన తండ్రి ఓసారి, చంద్రబాబు మరోసారి కడప ఉక్కుకి చేసిన శంకుస్థాపనలని పరిగణనలోకి తీసుకోకుండా 2019లో సీఎం అయిన జగన్ రెడ్డి డిసెంబర్ 23న స్టీల్ ప్లాంట్ నిర్మాణం కోసం తాను టెంకాయ కొట్టానని ప్రకటించుకున్నారు జగన్ రెడ్డి. చంద్రబాబే కాదు, తన తండ్రి చేసిన శంకుస్థాపనలని కూడా ఓర్వలేని జగన్ రెడ్డి పేరుమార్చి ప్రతీ ప్రాజెక్టుకూ మరోసారి శంకుస్థాపన చేయడంపై వైసీపీలోనే తీవ్ర అసంతృప్తి వ్యక్తం అవుతోంది.