కడపలో ఉక్కుపరిశ్రమ కోసం సాగుతున్న ఉద్యమాల నేపథ్యంలో గాలి జనార్ధన్‌రెడ్డి చేసిన ప్రకటన చర్చనీయాంశంగా మారింది. ఇన్నేళ్లుగా ఎక్కడ ఉన్నాడో తెలియని గాలి హఠాత్తుగా ఉక్కు పరిశ్రమను తానే నిర్మిస్తానని, అవకాశం తనకే ఇవ్వాలని రెండేళ్లలో పూర్తిచేస్తాననంటూ చెప్పడంతో. ప్రజా సొమ్ము మళ్లీ ఎక్కడగాలి పాలు అవుతుందోనన్న ఆందోళన ప్రజలను వేధిస్తోంది. బిజెపితోనూ, అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డిని అడ్డంపెట్టుకుని అప్పట్లో కడప జిల్లా జమ్మలమడుగులో ఉక్కుపరిశ్రమ స్థాపనకు అనుమతిని పొందాడు. ఈ మేరకు ప్రభుత్వం ఎకరా రూ. 18,500 చొప్పున దాదాపు 10760 ఎకరాలను బ్రాహ్మణి స్టీల్‌ ప్లాంట్‌కు అప్పగించింది.

jagan 28062018 2

బ్రాహ్మిణికి ముడి ఖనిజం సరఫరా కోసం ఓబులాపురంలో కేటాయించిన గనుల నుంచి అక్రమంగా ఖనిజాన్ని తరలించారన్న కేసులో 2009లో గనులను సీజ్‌ చేయడంతో పాటు గాలిజనార్ధన్‌ రెడ్డితో పాటు పలువురు ఐఎఎఎస్‌ అధికారులు సైతం జైలు పాలయ్యారు. దాదాపు 5.20 కోట్ల టన్నులకుపైనే అక్రమంగా తరలించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహారంలో కేవలం జిల్లా పరిధిలో మాత్రమే దాదాపు రూ. 500 కోట్లకు పైగా చేతులు మారినట్లు తెలుస్తోంది. ప్రజల సొమ్ము కొల్లగొట్టి తిరిగి అదే పరిశ్రమను నిర్మిస్తానని ముందుకు రావడం పట్ల ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. ప్రస్తుతం అటు పరిశ్రమ స్థాపన లేక ఇటు ఉద్యోగం రాక నిరుద్యోగులు ఇబ్బంది పడుతున్నారు.

jagan 28062018 3

గాలి జనార్థన్‌రెడ్డిని హఠాత్తుగా తెరముందుకు తెచ్చి బిజెపి తన రాజకీయ ఎత్తుగడకు శ్రీకారం చుట్టింది. ఏళ్లతరబడి నోరుమెదపని గాలి జనార్థన్‌రెడ్డి ప్రస్తుతం తనకే పరిశ్రమ నిర్మాణ పనులు అప్పగించాలని చెప్పడం వెనక బిజెపి హస్తం ఉందనడంలో ఎలాంటి సందేహమూ లేదు. ఉక్కు ఉద్యమాలు ఉధృతమవుతున్న నేపథ్యంలో కేంద్రంపై ఒత్తిడి తీవ్రమైంది. ఈ నేపథ్యంలో పరిశ్రమను ప్రకటిస్తే ఇతర పార్టీల జాబితాల్లో చేరుతుందని, గాలి జనార్ధన్‌రెడ్డి ద్వారా నిర్మించడం వల్ల బిజెపి ఖాతాలో జమచేసుకోవచ్చన్న యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే జగన్ మోహన్ రెడ్డి కూడా, ఉక్కు పరిశ్రమ పై, ఏమి మాట్లాడకుండా సైలెంట్ గా ఉన్నాడు. మొత్తానికి అందరూ కలిసి, పెద్ద ప్లానే వేసారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read