అవును జగన్ బీజేపీతో కలిసిపోయారు.. ఇప్పుడేంటి, ప్రత్యేక హోదా వదిలేసినప్పుడే కలిసిపోయాడుగా అంటారా ? ఇవాళ పోలవరం విషయంలో రాష్ట్రంలో చిన్న పిల్లాడి దగ్గర నుంచి, ముసలి వాళ్ళు దాకా, పోలవరం విషయంలో కేంద్రం, మన రాష్ట్రాన్ని అన్యాయం చేస్తుంది అని గగ్గోలు పెట్టి, ఆందోళన చెందుతుంటే, జగన్ మాత్రం బీజేపీని వెనుకేసుకు వస్తున్నారు.. ప్రధాని మోడీని ఒక్క మాట అంటే ఒక్క మాట కూడా అననివ్వట్లేదు... సోము వీర్రాజు, పురందేశ్వరి కంటే ఎక్కువుగా, కేంద్రాన్ని వెనకేసుకుని వస్తున్నారు జగన్... అదేదో పోలవరం రాష్ట్ర ప్రభుత్వమే ఆపేసినట్టు, కేంద్రం నిధుల వరద పారించినట్టు చెప్తున్నారు... ఈయనకి తోడుగా సాక్షి కూడా.. ఒకటే కేంద్రానికి డప్పు కొడుతుంది.. పోలవరం విషయంలో కేంద్రం తప్పు లేదు అంటూ ప్రచారం చేస్తుంది...
ఒక పక్క బీజేపీ నేతలే ఆచి తూచి స్పందిస్తుంటే, చంద్రబాబు పోలవరం నిర్మాణం విలువ పెంచడం వల్లే కేంద్రం కూడా భయపడుతోందంటూ జగన్ వ్యాఖ్యానించారు. స్పిల్ వే , స్పిల్ ఛానల్ టెండర్లు ఆపమంది కేంద్రం అయితే, జగన్ మాత్రం కేంద్రాన్ని ఒక్క మాట అంటే ఒక్క మాట అనట్లేదు... ప్రతిపక్షంగా ఉంటూ, కేంద్రంతో పోరాడి, పోలవరం సాధించాల్సింది పోయి, అంతా చంద్రబాబు చేశాడు అంటూ, రాజకీయం చేస్తూ, చివరకి పోలవరం విషయంలో కూడా సెల్ఫ్ గోల్ వేసుకున్నాడు జగన్... ఆంధ్రప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్న పోలవరం మీద జగన్ కామెంట్స్ వైసీపీ కి ఆత్మహత్య సదృశ్యం అని ఆ పార్టీకే చెందిన సీనియర్ నాయకుడు వాపోయారు...
ఇలాంటి వాదనతో జగన్, తాను బీజేపీలో చేరిపోయినట్టే అని, త్వరలోనే అది జరిగిపోతుంది అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు... జగన్ ప్రజల్లో మంచి మార్కులు కొట్టేయటానికి ఇంతకంటే మంచి అవకాసం ఉండదు అని, పోలవరం అనేది ప్రతి ఆంధ్రుడికి కనెక్ట్ అయ్యి ఉన్న అంశం అని, జగన్ కనుక కేంద్రాన్ని, చంద్రబాబుని దోషిగా నిలబెడితే, జగన్ హీరో అయ్యేవాడు అని, అలా కాకుండా కేంద్రానికి లొంగిపోయి రాజకీయ విమర్శలు చేస్తుంటే, మరింత దిగజారటం తప్ప, జగన్ చేసేది ఏమి లేదు అని అంటున్నారు... జగన్ చేస్తున్న పనికి భారీ మూల్యం తప్పదు అని అంటున్నారు.. ఇప్పుడు జగన్ కు ఏమన్నా ఊరట లభించినా, చంద్రబాబు, శివసేన లాంటి ఉద్దండులనే ఇబ్బంది పెడుతున్న మోడీ, జగన్ లాంటి అవినీతి పరుడుని అవసరానికి వాడుకుని, టైం చూసుకుని దెబ్బ వేస్తారు అని, అది జరిగి తీరుతుంది అని అంటున్నారు...