దాదపుగా 10 ఏళ్ళ కల సాకారం కావటంతో జగన్ మోహన్ రెడ్డి క్యాంప్ హుషారుగా ఉంది. అయితే, ఆంధ్రప్రదేశ్ అధికారిక మ్యాగజైన్ లో జరిగిన పొరపాటు, ప్రభుత్వ పెద్దలకు ఎంతో కోపం తెప్పించింది. జగన్ మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం తరువాత, వచ్చిన మొదటి సంచిక కవర్ పేజి పై , అయన ఫోటో బ్లాకు అండ్ వైట్ పడింది అంటూ, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సంచలనంగా మారింది. అంతే కాదు, రెండు మూడు చోట్ల వారికి అనుకూలంగా కూడా లేవు అంటూ, ప్రింట్ అయిన మ్యాగజైన్ ని పక్కన పడేసారు. బ్లాక్ అండ్ వైట్ ఫోటో వేసి, జగన్ ను కావలని అవమానించారు అంటూ ప్రభుత్వం వారి పై విచారణ చేసి, చర్యలు కూడా తీసుకునే అవకాసం ఉన్నట్టు తెలుస్తుంది. ప్రతి నెల ప్రభుత్వం తరుపున, ఆంధ్రప్రదేశ్ అధికారిక మ్యాగజైన్ విడుదల అవుతూ ఉంటుంది. ఏపి ప్రభుత్వం చేస్తున్న పనులు, ప్రజలకు ఇచ్చే సంక్షేమ పథకాలు, రాష్టంలో జిరిగే అభివృద్ధి పనులు, ప్రజలకు తెలియటానికి, 'ఆంధ్రప్రదేశ్ ' అనే పేరుతో ప్రభుత్వం ఓ మాస పత్రికను నడుపుతుంది. తెలుగు, ఇంగ్లిష్ భాషల్లో ప్రతి నెల ఈ పత్రిక వస్తుంది.
అయితే ఈ సారి ప్రభుత్వం మారటం, జగన్ రావటం జరిగిపోయాయి. ప్రతి నెల లాగానే, ఈ నెల కూడా తెలుగు, ఇంగ్లిష్ భాషల్లో జూన్ నెలకు సంబధించిన మ్యాగజైన్ రెడీ అయ్యింది. అయితే ఆ మ్యాగజైన్ కవర పేజ్ పై, జగన్ మోహన్ రెడ్డి బ్లాకు అండ్ వైట్ లో వచ్చింది అంటూ ప్రభుత్వ పెద్దలు అభ్యంతరం చెప్పారు. ఇది కావలానే చేసారు అంటూ ఎడిటర్ , మిగతా సిబ్బంది పై వైసీపీ నేతలు ఫైర్ అయ్యారు. అలాగే "జగన్ అనే అతను" అనే వ్యాఖ్యం పై కూడా వైసీపీ నేతలు అభ్యంతరం చెప్పారు. దీంతో ప్రభుత్వ పెద్దలు కూడా ఈ విషయం పై ఆగ్రహం వ్యక్తం చేసారు. జూన్ మాసానికి ప్రింట్ అయిన 25 వేల కాపిలను తీసుకువెళ్ళి గోడౌన్ లో పడేసారు. ఈ ప్రింటింగ్ కు అయిన ఖర్చు, అక్షరాల 38 లక్షలు. మేము ఆదా చేస్తున్నాం అంటున్న ప్రభుత్వం, కేవలం ఫోటో బ్లాకు అండ్ వైట్ లో వచ్చింది అంటూ, 25 వేల కాపిలను బ్యాన్ చెయ్యటం వల్ల ప్రభుత్వ ఖజానాకు వచ్చిన నష్టం 38 లక్షలు.