వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీకి 30 సీట్లు కూడా రావని ప్రశాంత్ కిశోర్ రిపోర్ట్ ఇచ్చారని, దీంతో అసహనానికి గురైన జగన్... టీవీ పగులగొట్టారని రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. రాజకీయ వర్గాల్లో ఇదే టాక్ నడుస్తుందని చెప్పారు. గురువారం కర్నూలులో ఆయన విలేకరులతో మాట్లాడుతూ... జగన్‌కు సీఎం పదవి పిచ్చి పట్టిందన్నారు. అభద్రతాభావంతో జగన్ ఇష్టానుసారం మాట్లాడుతున్నారని మంత్రి అన్నారు. అలాగే సాగునీటి రంగంపై జగన్ కు అవగాహన లేదని, ప్రాజెక్టులు పూర్తయితే జగన్ సీఎం కాలేరని కేసులు వేయిస్తున్నారని అన్నారు. జగన్ స్కూల్ ఎగ్గొట్టిన పిల్లాడిలా రోడ్లమీద తిరుగుతున్నారని, జగన్ కుట్రలు, కుతంత్రాలు సాగనివ్వమని మంత్రి దేవినేని అన్నారు.
కర్నూలు జిల్లాలో ఉప ముఖ్యమంత్రి కృష్ణమూర్తి తో కలిసి మంత్రి దేవినేని మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి దేవినేని మాట్లాడుతూ కర్నూలు జిల్లాలో 47% వర్షపాతం తక్కువగా నమోదైందని ఈ పరిస్థితుల్లో ఎత్తిపోతల పథకాలు ఉపయోగపడతాయని మంత్రి దేవినేని అన్నారు. ఈ సీజన్లో శ్రీశైలానికి 370 టీఎంసీలు వచ్చాయని ఒకపక్క1592 టీఎంసీల గోదావరి నీరు సముద్రంలోకి వెళ్లిందని అన్నారు. జిల్లాలో హంద్రీనీవా తో చెరువులు నింపుతామన్నారు. రాయలసీమలో బంగారం పండించే పరిస్థితి తెస్తాననీ పోలవరం పూర్తయితే జగన్ కు పునాదులు కలుగుతాయని భయం పట్టుకుందని అన్నారు.
పోలవరం ఆపటానికి కోర్టుల్లో కేసులు వేస్తూ జగన్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడని జగన్ ఆటలు సాగవని ఎట్టిపరిస్థితుల్లో 2019 పోలవరం పూర్తి చేసి తీరుతామన్నారు.పట్టిసీమ పైపులు పీకుతానంటున్న జగన్ కు ఇరిగేషన్ ప్రాజెక్టులపై అవగాహన లేదని జగన్ కుట్రలు కుతంత్రాలు సాగవని వైసిపికి 30 సీట్లు కూడా రావని ప్రశాంత్ కిషోర్ నివేదిక ఇచ్చాడని అభద్రతాభావంతో జగన్ ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తున్నాడన్నారు. ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమం రెండు కళ్లుగా ముందుకు వెళుతుందని ప్రజలు చాలా తెలివిగా ఉన్నారని జగన్ కు 2019లో ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా బుద్ది చెప్పనున్నారని మంత్రి దేవినేని జోస్యం చెప్పారు.