ఇటీవలకాలంలో కేబినెట్ మీటింగ్ నిర్వహించిన సందర్భంగా మంత్రుల పనితీరుపై సీఎం వ్యాఖ్యలు చేస్తుండడంతో కొందరికి ఉద్వాసన తప్పదని వార్తలు వస్తున్నారు. గతంలో ఓపెన్‌గానే పనితీరు బాగాలేదని, కొందరు కొత్తవారిని తీసుకుంటామని లీకులిచ్చిన సీఎం..తాజా కేబినెట్ భేటీలోనూ ముగ్గురుకి ఉద్వాసన తప్పదని హెచ్చరించారని టాక్ వినిపిస్తోంది. మంత్రి పదవి వచ్చిన నుంచీ వివాదాలు బాట పట్టిన రాయలసీమకి చెందిన మహిళా మంత్రికి ఉద్వాసన తప్పదని తెలుస్తోంది. ఆమె మళ్లీ టీవీ షోలు చేసుకోవాల్సిందేనని వైసీపీ సర్కిల్లో టాక్. మరోవైపు అమాయకత్వంతో నటిస్తూ, వైసీపీ సర్కారుని ఎర్రి పుష్పం చేస్తున్న కోడిగుడ్డు శాఖా మంత్రిని తప్పిస్తారని ప్రచారం సాగుతోంది. కేబినెట్ భేటీ పూర్తయ్యాక వెళ్లిపోతున్న మంత్రుల్ని పిలిచి చాంబర్లో క్లాస్ తీసుకోవడంతో వీరికి బుగ్గ కారు యోగం తప్పినట్టేనని తాడేపల్లి వర్గాల సమాచారం. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలను గెలిపించే బాధ్యతలను మంత్రులకు సీఎం కట్టబెట్టారు. ఒక్కో మంత్రికి ఆరుగురు ఎమ్మెల్యేల బాధ్యతలను ఆయన అప్పగించారు. గెలిపించకపోతే మంత్రి పదవులు వదులుకోవడానికి సిద్ధంగా ఉండమంటూ వార్నింగ్ ఇచ్చారట. గత నెలలో జరిగిన కేబినెట్ సమావేశంలో ఇద్దరు మంత్రులకు సీఎం మందలించారు. ఒకరేమో అనవసరంగా వేరే నియోజకవర్గాల్లో తలదూర్చడం.. ఇంకో మంత్రిపై భూ తగాదాల ఆరోపణలు రావడంతో ఇద్దరినీ పిలిచి హెచ్చరించి పంపారని తెలిసింది. లేటెస్ట్ మంత్రివర్గ సమావేశంలో గతంలో కోటింగ్ అందుకున్న మంత్రులకి రీ కోటింగ్ పడినట్టు వైసీపీ వర్గాలు చెబుతున్న సమాచారం. ఈ లెక్కన ఈ మంత్రులకి మరో అవకాశం లేనట్టే.
ముగ్గురు మంత్రులు అవుట్.. లిస్టులో ఉన్నది వారేనా ?
Advertisements