తెలంగాణా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 55 మంది జిల్లా జడ్జిలను బదిలీ చేస్తూ, నిన్న తెలంగాణా హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం కామారెడ్డి 9వ సెషన్స్ జిల్లా జడ్జిగా ఉన్న రమేష్ బాబుని , సిబిఐ ప్రత్యేక కోర్టు పిన్సిపల్ స్పెషల్ జడ్జిగా తెలంగాణా హైకోర్టు నియమించింది. ఇప్పటి వరకు సిబిఐ ప్రత్యేక కోర్టు పిన్సిపల్ స్పెషల్ జడ్జిగా ఉన్న మధుసూదన్‌రావును బదిలీ చేసింది. అయితే జగన్ మోహన్ రెడ్డికి చెందిన అక్రమ ఆస్తుల కేసు విచారణ, మధుసూదన్‌రావు చేస్తూ వచ్చారు. రోజు వారీ విచారణ కొనసాగించారు. సుప్రీం కోర్టు ఆదేశాల ముందు ప్రతి శుక్రవారం, జగన్ మోహన్ రెడ్డికి చెందిన 11 కేసులు పైన విచారణ సాగేది. అయితే సుప్రీం కోర్టు, ప్రజా ప్రతినిధుల కేసులు అన్నీ కూడా తొందరగా విచారణ చేయాలని ఆదేశాలు ఇచ్చిన నేపధ్యంలో, రోజు వారీ విచారణను మధుసూదన్‌రావు చేస్తూ వచ్చారు. ఇప్పటి వరకు అయితే కేసు అసలు వాదనలు అయితే ఇంకా మొదలు కాలేదు. 12 ఏళ్ళు అవుతున్నా, ఈ కేసు విచారణ ఇంకా సాగుతూనే ఉంది. ఇప్పటి వరకు విచారణలో కేవలం డిశ్చార్జి పిటిషన్ల పై మాత్రమే విచారణ సాగుతుంది. ఈ కేసులు ఉన్న వాళ్ళు, కేసు విచారణా లేట్ చేయటానికి ఒకదాని తరువాత ఒకటి, డిశ్చార్జి పిటిషన్లు వేస్తూ వస్తున్నారు.
ఈ డిశ్చార్జి పిటిషన్ల పైనే ప్రస్తుతం వాదనలు కొనసాగుతున్నాయి. సిబిఐ తరుపు వాదనలు విన్న తరువాత, ఈ డిశ్చార్జి పిటిషన్ల పై కోర్టు ఒక నిర్ణయం తీసుకుని, అసలు కేసు విచారణ మొదలు పెట్టాల్సి ఉంది. అయితే ఈ నేపధ్యంలో, నాలుగేళ్లుగా ప్రత్యేక కోర్టు పిన్సిపల్ స్పెషల్ జడ్జిగా ఉన్న మధుసూదన్‌రావు బదిలీ కావటం, కొత్త జడ్జి రావటంతో, ఈ కేసులో డిశ్చార్జి పిటిషన్ల పై వాదనలు మళ్ళీ ముందు నుంచి వాదనలు వినిపించాల్సి ఉంటుందని, న్యాయవాదులు అంటున్నారు. దీని పైన క్లారిటీ రావాల్సి ఉంది అని అంటున్నారు. సహజంగా జడ్జి మధ్యలో మారితే, కొత్త జడ్జి మళ్ళీ ముందు నుంచి కేసు వింటారు. కొన్ని సందర్భాల్లో కొనసాగిస్తారు. మరి కొత్తగా వచ్చే జడ్జి ఏమి చేస్తారు, అనేది ఇప్పుడు తెలియాల్సి ఉంది. మళ్ళీ మొదటి నుంచి ఈ కేసు వినాల్సి వస్తే మాత్రం, మళ్ళీ జగన్ కేసులు ముందు నుంచి వస్తాయి. అప్పుడు ఈ కేసులు తేలటానికి మరింత సమయం పడుతుంది. మరి ఈ కేసులు విషయంలో ఏమి అవుతుందో చూడాలి. జగన్ క్యాంప్ మాత్రం హ్యాపీగా ఉంది.