ముఖ్యమంత్రి కుర్చీ కోసం, పాదయాత్ర చేస్తున్న జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర కోనసీమలో కొనసాగుతుంది. ఈ సందర్భంలో జగన్ మోహన్ రెడ్డి పశ్చిమగోదావరి జిల్లా ఉంగుటూరు వద్ద పెదకాపవరం గ్రామ శివారులో, అక్కడ చెరువుని అక్కడ నీళ్ళను చూసి పులకించి పోయారు... వేసవిలో కూడా ఇంత నీరు ఉండటంతో అక్కడకు వెళ్లి, చెరువులో చేపలు, రొయ్యలు పట్టే వారి దగ్గరకు వెళ్లారు.. వారి దగ్గర ఆ చెరువులో చేపలు, రొయ్యలకు మేత వేసే విధానం చూశారు. అంతే కాదు వల వేయడమే కాదు… వాటిని పట్టడం ఎలాగో స్థానికులను అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత తాను పట్టి సరదా తీర్చుకున్నారు. ఇంతటితో అయిపోలేదు.. అసలు స్టొరీ ఇక్కడే ఉంది.. జగన్ వెనుక ఉండే ప్రశాంత్ కిషోర్ టీం, అక్కడ అన్నీ ఫోటోలు తీసారు..
జగన్ చెరువు దగ్గరకు వెళ్ళటం, చెరువులో నీళ్ళు దండిగా ఉన్నాయి కదా అని చెప్పటం, స్వయంగా అక్కడ చేపులు, రొయ్యలు పట్టటం, రొయ్యలు బయటకు తీసి, సైజు బాగా ఉంది డబ్బులు బాగా వస్తాయి కదా అని చెప్పటం, ఇవన్నీ ఫోటోలు, వీడియోలు బయటకు వచ్చాయి... ఈ ఫోటోలు, వీడియోలు చూసిన ప్రజలు, జగనే స్వయంగా, అన్నీ బాగున్నాయి అని చూపిస్తున్నారుగా అని అనుకుంటున్నారు... ఒక పక్క వేసవి అయినా సరే. ఎక్కడా పచ్చదనం తగ్గలేదు, కొబ్బరి చెట్లు, చెరువులు చూస్తే మనసు పులకించిపోతోంది, ఇంత వేసవిలో కూడా చెరువులు అన్నీ నిండు కుండ లాగా ఉన్నాయి, ఇవన్నీ చూపిస్తూ, జగనే స్వయంగా, చంద్రబాబు పరిపాలనలో నీరు ఎలా ఉందో చుపిస్తున్నట్టు ఉంది అనుకుంటూ, టిడిపి ఎలాగూ చేసింది చెప్పుకోవటం లేదు కాబట్టి, జగన్ ఈ విధంగా చెప్తున్నారా ఏంటి అనుకుంటున్నారు...
మరో పక్క, అంతకు ముందు రోజే , బహిరంగ సభలో, ఆక్వా సాగు దెబ్బతింది అని, నీళ్ళు లేవని, చంద్రబాబు పై జగన్ విమర్శలు గుప్పించారు... తీరా ఇక్కడేమో, తానే స్వయంగా, నిండు కుండలా ఉన్న చెరువులో రొయ్యలు పట్టి, ఇంత పెద్ద రొయ్యలా అని ఆశ్చర్యపోయి, చంద్రబాబు పరిపాలన సూపర్ అని చెప్పకనే చెప్పారు.. అయితే, ఇలాంటి ఫీడబ్యాక్ వచ్చింది అని తెలుసుకున్న జగన్, ప్రశాంత్ కిషోర్ బ్యాచ్ పై ఫైర్ అయ్యారు. ఇలాంటి ఫోటోలు బయటకు ఇవ్వద్దు అని ఎన్ని సార్లు చెప్పాలి, ఇది వరకు రాయలసీమలో కూడా పచ్చని పొలాలు, రోడ్లు, నీళ్ళు, ఇలా ఫోటోలు తీసి ఇచ్చి, మనమే చంద్రబాబు బాగా చేస్తున్నాడు అని చెప్పుకునేలా చేసారు, ఇప్పుడు ఇలా చేస్తున్నారు అంటూ జగన్ ఫైర్ అయ్యారు. ఇలాంటి ఫోటోలు కాకుండా, దీనంగా, హీనంగా ఉన్న ఫోటోలు, ఊరి బయట ఉండే ఫోటోలు మాత్రమే బయటకు వదలాలని, ఇంకో సారి ఇలాంటి తప్పు చేస్తే, సహించేది లేదని జగన్ గట్టి వార్నింగ్ ఇచ్చారు.