జగన్ మోహన్ రెడ్డి గారు, నేను 30 ఏళ్ళు ముఖ్యమంత్రి అంటున్న సంగతి తెలిసిందే... అయితే, ఈ రోజు ఉగాది పర్వదినం సందర్భంగా గుంటూరు జిల్లా కాకుమానులో వైసిపీ ఆధ్వర్యంలో జరిగిన ఉగాది వేడుకల్లో జగన్ మోహన్‌రెడ్డిని పురోహితులు ఎక్కడికో తీసుకువెళ్ళి నుంచో పెట్టారు... జగన్ మోహన్ రెడ్డి స్టార్ట్ తొందరలోనే తిరుగుతుంది అంట... ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి స్వర్ణయుగం అంట... వైఎస్సార్ పాలనను ఆంధ్రప్రదేశ్ ప్రజలు మళ్లీ చూడబోతున్నారని పంచాంగకర్తలు పేర్కొన్నారు. వైఎస్సార్ పాలన అంటే ఏంటో తెలిసిందేగా...
అక్టోబర్ 25 వరకూ ఆయన జాతకంలో ఉన్న గోచార సమస్యలు పూర్తి కానున్నాయని పంచాంగకర్తలు తెలిపారు. ఇక, అవి పూర్తి కాగానే జగన్ కీర్తి మరింత పెరుగుతుందని, 2019 ఎన్నికలకు ముందే ఆయనకు బుధ మహాదశ ప్రారంభమవుతుందని, ఇదేమీ ముఖస్తుతి కోసం చెప్పబోవడం లేదని తెలిపారు. ఇక ఆ టైం నుంచి, జగన్ అందరినీ శాసించి, రాజకీయాలు తిప్పేస్తారంట... వచ్చే ఎన్నికల్లో జగన్ జాతకరీత్యా 135 సీట్లు వస్తాయని, తను చెప్పిన అంశం తప్పయితే, ఇక జీవితంలో మరెక్కడా పంచాంగ శ్రవణం చేయబోనని ఈ పంతులు గారు సవాల్ విసిరారు...
తాను ఉన్న విషయాన్ని ఉన్నట్టుగా చెబుతున్నానని అన్నారు. జగన్ కు మంచి జరగనుందని, 2019 మే తరువాత 12 సంవత్సరాల, 8 మాసాల 18 రోజులు ముఖ్యమంత్రి పదవిలో ఉంటారని చెప్పారు. తాము 40 మంది పంచాంగకర్తలం కూర్చుని భవిష్యత్తులో జరగబోయేదాన్ని అంచనా వేశామని, ఈ అంచనాలు ఏకాభిప్రాయమని అన్నారు... మొన్న జగనేమో, రెండు టెంకాయలు ఎక్కువ కొట్టమన్నాడు... వీరేమో, 40 మంది కూర్చుని, డిసైడ్ చేసేసాం అంటున్నారు.. ఇంతాకీ ప్రజలు ఏమి చెయ్యాలి ? వీరి పాత్ర, వీరి అభిప్రాయం ఏమి లేదా ? ఇంతకీ పాపం, జగన్ ను అంత ఆనంద పరిచిన ఆ పంతులు గారికి, సంభవన భేషుగ్గా ఇచ్చారో లేదో...