అమరావతి అనే మాట వింటే జగన్ కు ఎంత చిరాకో అందరికీ తెలిసిందే... రాజధాని గా అమరావతి ని నిర్ణయించినప్పటి నుంచి జగన్ కు కంటి మీద కునుకు లేకుండా పోయింది. రాజధాని నిర్మాణానికి భూమి నుంచి మొదలుకొని అనేక అవాంతరాలు, జగన బ్యాచ్ సృష్టించింది... అంతర్జాతీయ స్థాయి రాజధాని కట్టుకోవాలన్న ప్రజా సంకల్పానికి తూట్లు పొడిచేలా వీరి ప్రవర్తన సాగింది. రాజధాని పంటలు తగలుపెట్టటం దగ్గర నుంచి, గ్రీన్ ట్రిబ్యునల్ లో కేసులు దాకా, ఇలా అన్ని రకాలుగా... ముఖ్యమంత్రి సంకల్ప బలం కానివ్వండి, ప్రజల కోరిక కానివండి ఆ అడ్డంకులు అన్ని అధిగమించి ముందుకు సాగుతున్నం...
అయితే జగన్ కు మాత్రం ఇప్పటికీ అమరావతి మన రాజధాని అంటే జీర్ణించుకోలేక పోతున్నారు.. అందుకే అమరావతిలో అసెంబ్లీ సమావేశాలకు కూడా రాను అని చెప్పారు... రాజ్యసభ ఎన్నికలు, అమరావతిలో వద్దు, హైదరాబాద్ లో కావలి అంటూ లేఖలు రాస్తున్నారు... తాజాగా, ప్రకాశం జిల్లాలో నిర్వహిస్తున్న సంకల్పయాత్రలో భాగంగా శనివారం సాయంత్రం దర్శి నియోజకవర్గం తాళ్లూరులో జరిగిన బహిరంగ సభలో జగన్, మరో సారి అమరావతి పై విషం చిమ్మారు...
నవ్యాంధ్ర రాజధాని ఏర్పాటుకు అన్ని విధాలా అవకాశం ఉన్న జిల్లాలోని దొనకొండ ప్రాంతానికి చంద్రబాబు అన్యాయం చేసిందని వైసీపీ అధినేత జగన్ ఆరోపించారు. దొనకొండ ప్రాంతంలో 50వేల ఎకరాల అటవీ భూమి ఉందన్నారు. అందువలన అక్కడ రాజధాని ఏర్పాటు చేయాలని కేంద్ర కమిటీ సిఫార్సు చేస్తే ము ఖ్యమంత్రి చంద్రబాబు బుట్టదాఖలు చేశారని విమర్శించారు. ఇలా చేస్తూ, ప్రజల మధ్య, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు... దొనకొండ ఎందుకు వద్దో, అమరావతి ఎందుకు కావాలో ప్రజలకు చెప్పే రాజాధాని ఎంపిక జరిగింది.. కాంగ్రెస్ పార్టీ పన్నిన కుట్రే దొనకొండ... విభజనకు ముందు, దొనకొండ రాజధాని అవుతుంది అని, కాంగ్రెస్ కు, జగన్ బ్యాచ్ మొత్తం చేత, అక్కడ భూములు కొనిపించారు... అయినా దొనకొండ రాష్ట్రానికి మధ్యలో కూడా ఉండదు, అనేక ఇబ్బందులు కూడా ఉంటాయి... అందుకే అన్ని ప్రాంతాల వారికి అనుకూలంగా, అమరావతిని నిర్ణయించారు... చివరకు దొనకొండ రాజధాని కాకపోవటంతో, నిత్యం అమరావతిని నిందిస్తూ, అమరావతి నాశనం కోరుకుంటూ జీవిస్తున్నారు...