జగనసేన పై, పవన్ కళ్యాణ్ పై, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. బుధవారం నెల్లూరు జిల్లాలోని సర్వేపల్లిలో వైయస్ జగన్ ప్రజాసంకల్ప యాత్ర కొనసాగుతోంది... ఈ సందర్భంగా జగన్ ఓ మీడియా ఛానల్‌తో మాట్లాడుతూ, పవన్ పై విమర్శలు గుప్పించారు. అసలు పవన్ ని లైట్ తీసుకువచ్చు అంటూ, పవన్ వల్ల అసలు మాకు ఏమి కాదు, జనసేన కాదు కదా, ఏ సేన వచ్చినా, నేనే సియం అంటూ జగన్ మాట్లాడారు... ఎన్ని సేనలు వచ్చినా, ప్రజలు నన్ను ముఖ్యమంత్రిని చెయ్యటానికి ఫిక్స్ అయిపోయారు అంటూ జగన్ చెప్పుకొచ్చారు...

jagan 31012018 2

జనసేన పార్టీతో గానీ, పవన్‌కల్యాణ్‌తో గానీ వైసీపీకి వచ్చే నష్టమేమీలేదని జగన్ చెప్పుకొచ్చారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు వైసీపీకి పడకుండా పవన్‌కల్యాణ్ అడ్డుపడుతున్నారనేది కేవలం అపోహ మాత్రమేనని తెలిపారు.... 2014 ఎన్నికల్లో టీడీపీకి-వైసీపీ మధ్య 5లక్షల ఓట్లే తేడా అని చెప్పారు.... మోదీ, పవన్‌కల్యాణ్ ప్రచారం చేసినా వచ్చింది 5 లక్షల ఓట్లేనని గుర్తుంచుకోవాలన్నారు... పవన్ కళ్యాణ్ ఫాన్స్ గురించి కూడా కించపరుస్తూ జగన్ మాట్లాడిన మాటలు చర్చనీయాంశం అయ్యాయి..

jagan 31012018 3

అలాగే చంద్రబాబు పై కూడా ఆరోపణలు చేసారు... చంద్రబాబు ప్రభుత్వం రైతులను మోసం చేస్తోందని జగన్ ఆరోపించారు. రైతులకు కరెంటు ఇవ్వటం లేదు, నీళ్ళు ఇవ్వటం లేదు, పొలాలు ఎండిపోతున్నాయి అంటూ, పచ్చని పొలాల మధ్యే ఉంటూ, జగన్ వ్యాఖ్యలు చెయ్యటం విడ్డూరం... అలాగే, రాష్ట్రానికి ప్రధాన సమస్య చంద్రబాబేనని జగన్ అన్నారు... రాష్ట్రంలో ఏ వర్గం కూడా సంతోషంగా లేరని అన్నారు... చంద్రబాబుని చూసి, ఎవరూ పెట్టుబడులు పెట్టాటానికి రావట్లేదు అంటూ, శ్రీ సిటీ లాంటి పారిశ్రామిక క్లస్టర్ పక్కన నుంచుని కామెడీ చేసాడు జగన్... మొత్తానికి, చంద్రబాబు కంటే, పవన్ కళ్యాణ్ అంటేనే, జగన్ భయపడుతున్నాడు అనేది అర్ధమవుతుంది...

Advertisements

Advertisements

Latest Articles

Most Read